బోయింగ్ 787 నిర్వహణలో తమ ప్రమేయం లేదు.. టర్కీ స్పష్టికరణ..!
అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి టర్కిష్ టెక్నిక్ ఎయిర్ ఇండియాతో నిర్వహణ ఒప్పందాన్ని కలిగి ఉన్నప్పటికీ.. అది బోయింగ్ 777 వైడ్-బాడీ విమానాలకు మాత్రమే పరిమితం అని, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ను కవర్ చేయదని అధికారులు వివరించారు. ఈ ఒప్పందాలు 2024, 2025లో సంతకం చేయబడ్డాయి.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి గందరగోళంగా మారింది. భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రోజంతా మేఘాలు కమ్ముకున్నా, వర్షం మాత్రం కొన్ని చోట్లే కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మధ్య, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాయంత్రం తరువాత జల్లులు పడొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఎక్కడా భారీ వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు.
మరో లవ్ అండ్ రొమాంటిక్ మూవీ..రీ రిలీజ్
ప్రజంట్ తెలుగు స్టేట్స్‌లో కొత్త సినిమాలు లేక పాత సినిమాలే మళ్ళీ థియేటర్స్ లో రాజ్యమేలుతున్నాయి. గతంలో విడుదలై ఘన విజయాలు సాధించిన సినిమాలను, కొత్త టెక్నాలజీలోకి మార్చి మరి రీమోడల్ చేసి హీరోల పుట్టినరోజులు, పండగలకి మళ్లీ విడుదల చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండటం లేదు. ఇందులో భాగంగా తాజాగా మరో క్లాసిక్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేసావే’ కూడా రీ రిలీజ్ కానుంది.నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం. ఎటువంటి అంచనాలు లేకుండా 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమాకి, మొదట నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత యూత్ ఎగబడి చూశారు. ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థ పై, మహేష్ సోదరి ఘట్టమనేని మంజుల నిర్మించిన ఈ చిత్రంతో, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిని సమంత తన అందం నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అక్కడి నుంచి మొదలు సామ్ కెరీర్ పరంగా వెన్నక్కి తిరిగి చూసుకోలేదు. ఈ మూవీకి సంబంధించిన మాటలు నేటికి ఇష్టంగా వింటుంటారు. ఇక తాజాగా జూలై 18న ఈ మూవీ రీ రిలీజ్ కాబోతున్నట్లు మోకర్స్ తెలిపారు. అలాగే సామ్ చై కి సంబంధించిన రొమాంటిక్ పిక్ కూడా షేర్ చేశారు.
ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ జూన్ 20న బంద్‌కు మావోయిస్టుల పిలుపు
తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్‌ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్ మైలారపు అడెల్ అలియాస్ భాస్కర్ సహా 7 మంది మావోయిస్టులను పోలీసులు హత్య చేశారని మావోయిస్టులు ఆరోపించారు.
F-35 యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్..!
కేరళలోని త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక F-35B లైట్‌నింగ్ II యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం సంచలనంగా మారింది. ఇండియన్ ఓషన్‌పై మిషన్ లో ఉండగా, విమానం ఇంధనం తక్కువ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ F-35B యుద్ధ విమానం బ్రిటన్‌కు చెందిన HMS Prince of Wales క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ప్రస్తుతం ఈ వాహక నౌకా సమూహం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లలో పాల్గొంటోంది. ఇటీవలే భారత నౌకాదళంతో సంయుక్త సముద్ర విన్యాసాలు పూర్తి చేసిన ఈ దళం, భారత సముద్ర ప్రాంతంలో టూరింగ్ చేస్తోంది.
తాగునీటి సమస్యకు పరిష్కారంగా అలగనూరు రిజర్వాయర్..!
కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, నందికొట్కూరు ఎమ్మెల్యే జై సూర్యలతో కలిసి అలగనూరు బ్యాలెన్స్డ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కడప జిల్లాలో తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చగలిగే శక్తి ఉన్న ప్రాజెక్టు అలగనూరేనని పేర్కొన్నారు. 1985లో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ రిజర్వాయర్‌కు మూడుకోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. 3500 ఎకరాల విస్తీర్ణంలో డ్యాం నిర్మాణాన్ని ఆ రోజు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో 59.76 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు 2004లో పూర్తి చేయబడింది. 2005లో 2.6 టీఎంసీల నీటిని నింపి ఉపయోగంలోకి తీసుకురాగలిగారు.
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్
పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల నుంచి నేతలు హాజరయ్యారు. ఒక్కో మండలానికి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రేపటి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, స్పష్టమైన తేదీలు ప్రకటిస్తాం అని తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం.. మాజీ మంత్రి ఫైర్..!
ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన నేడు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. ఈ సందర్బంగా బుగ్గన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా ఉపేక్షించరనీ ఆయన మాటలు వింటే అర్థం అవుతుంది.. అది ప్రజలైన కూడా ఆయన ఉపేక్షించరని విమర్శించారు. ప్రజలు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటి అమలుపై ప్రశ్నిస్తే ఆయన ఉగ్రంగా స్పందిస్తున్నారని తెలిపారు.