Tollywood: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. కాగా, ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు.
Read Also: India Canada: దారికి వచ్చిన కెనడా.. ఇండియా దౌత్య విజయం..
అయితే, రేపటి నుంచి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు.. ఈ నేపథ్యంలో రేపు సీఎంతో సినీ పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఇక, ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
Read Also: Devara 2: ఎన్టీఆర్ చెప్పినా కూడా డౌటా?
ఇక, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సినిమావాళ్లు సీఎంను కలవకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. అలాగే, ఏపీలో థియేటర్ల పరిస్థితి.. సదుపాయాలకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన అధికారులు.. థియేటర్ లలో తనిఖీలు చేపట్టారు.
Read Also: Rajasthan: భార్య తప్పుడు కట్నం ఆరోపణలు.. అత్తింటి ముందే ‘‘టీ’’ స్టాల్ పెట్టి భర్త నిరసన ..
మరోవైపు, రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అయినప్పటికీ రాష్ట్రానికి పూర్తిగా సినీ ఇండస్ట్రీ రాలేదు.. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏం కోరతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.