ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు. నేడు ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలపై చర్చించుకున్న చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని చంద్రబాబు కోరే అవకాశం. నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రూ.494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్. జహీరాబాద్ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పస్తాపూర్‌లో…
పోలీసుల తనిఖీలు.. భారీ “సైబర్ డెన్” గుర్తింపు..! విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ సైబర్ డెన్ ను గుర్తించారు పోలీసులు. దీనితో ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతి, యువకులను తీసుకువచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని పరవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం ఉగ్ర మూలాలతో ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు.…
హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలుచోట్ల వర్షం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మేఘాలు కమ్ముకున్నాయి. అనేక చోట్ల వాన కురుస్తోంది. దీంతో ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ…
నేడు ఏపీ హైకోర్టులో పీఎస్సార్ బెయిల్ పిటిషన్ల విచారణ. నటి జత్వాని కేసు, ఏపీపీఎస్సీ అక్రమాల కేసుల్లో బెయిల్ కోరుతూ పిటిషన్. రెండు బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు. అంబేద్కర్ కోనసీమ: నేడు అమలాపురంలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. మధ్యాహ్నం అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం.. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా టీడీపీ మిని మహానాడుకు హాజరుకానున్న మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతి: మధ్యాహ్నం 12…
ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందన్న ఆయన.. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవుచెప్పారు..
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.. నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది.. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగ అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు.. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.. ఇక, కుప్పం పర్యటన ముగించుకొని సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు...
రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు సీఎంకు వివరించారు. Also Read:…
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్టు చెప్పుకుంటారు. ఆయన నోటికి కూడా హద్దూ అదుపూ ఉండేది కాదన్నది రాజకీయవర్గాల్లో విస్తృతాభిప్రాయం. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా తగ్గేదే లేదన్నట్టు చెలరేగిపోయేవారు. అబ్బే.... వాళ్ళకంత సీన్ లేదు, ఇంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్ళు విసిరేవారాయన. కట్ చేస్తే.... రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే.
అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి.. కొడతానంటే.. కొట్టమనండి.. కానీ, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి.. అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..