టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే ‘మహానాడు’ నేటి నుంచి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపు మయం అయింది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రానున్నారు. ప్రస్తుతం…
నేడు గుజరాత్ పట్టణ ప్రగతి పథం వేడుకలు. వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. పీఎం ఆవాస్ యోజన లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ. స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులు విడుదల. ఐపీఎల్లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్ ప్రారంభం. ఫేవరెట్‌గా బరిలో దిగనున్న తెలుగమ్మాయి జ్యోతి. గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన జ్యోతి. కడప జిల్లా : నేటి నుంచి కడపజిల్లా…
తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కడపలో మూడురోజుల పాటు జరగనున్న మహానాడు .. రేపు ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు.. పార్టీ నివేదికను మహానాడుకు సమర్పిస్తారు. పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు కోసం చూడరని, దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో ప్రధాని సైతం ఎక్కడా తలవంచరన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత ప్రధానిదే అని స్పష్టం చేశారు. ‘పీఎం-జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము అని డిప్యూటీ సీఎం…
నేడు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం.. కీలక అంశాలపై చర్చ..! నేడు ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రుల, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల…
కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం.. రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్‌గా ఉన్నారని సర్వే చెప్పింది. మొత్తం, 10,481 మంది సర్వేలో ప్రతిస్పందించారు. సర్వే ప్రకారం,…
విభజన చట్టంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టారు.. పదేళ్లయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజధానిగా లేదు.. గతంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు.. ఇప్పుడు చట్ట సవరణ చేసి అమరావతిని నోటిఫై చేయాలని కోరామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ సహా మరికొందరితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు.. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ వస్తున్నారు.. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.. అమిత్‌షాతో విడిగా కూడా ప్రత్యేక చర్చలు జరిపారు ఏపీ ముఖ్యమంత్రి.. గంటన్నర పాటు అమిత్ షా - చంద్రబాబు సమావేశం సాగింది..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్.. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం అక్రమాలపై ఆధారాలు చూపాలని వైఎస్ జగన్ సవాల్ చేశారు.. దీనిపై ఏమీ సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు చేతులు ఎత్తేశారని సెటైర్లు వేశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ఆరు సీట్లు కూడా రావన్న భయం పట్టుకుంది వైసీపీ నేతలకు అని కామెంట్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కంటే ఏపీ లిక్కర్స్ స్కాం కేసు చాలా పెద్దదని ఆరోపించారు.. మభ్యపెట్టడం మాయ చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజమని దుయ్యబట్టారు..