ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం పూర్తి కావాలని, జూలై నెలాఖరుకు ఉన్న ఆటంకాలు తొలిగించాలని సీఎం అధికారులకు చెప్పారు. జాతీయ రహదారులు,…
నేడు సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న భట్టి, పొన్నం. నేడు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డులు. టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డులు. నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం. నేడు ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న తుమ్మల,…
టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిపోయింది.. ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి.. వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. రాష్ట్రంలో జరుగుతోన్న క్రైమ్, ప్రస్తుత పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తాం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను గుంటూరు రమేష్ హాస్పిటల్లో వైసీపీ నేతలతో కలిసి పరామర్శించనున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది.
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇప్పుడు, టీడీపీకి గుడ్బై చెప్పారు.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం..
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.
పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..! జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం,…
రైతు సమస్యలపై ఫోకస్ పెంచింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. తాజాగా పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పొగాకు రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అడవులు, పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం - వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు,
వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం - వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కొంతమంది మంత్రులు అధికారులు కూడా స్టాళ్లు పరిశీలించారు.