క్వాంటమ్ వ్యాలీపై వర్క్ షాప్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నేషనల్ క్వాంటం మిషన్ ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ తో కలిసి అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పాలనలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనాన్ని కేవలం ఐటీ మాత్రమే తేగలదని విశ్వసించానని అన్నారు.
Also Read:e-Cycle: ఏం ట్యాలెంట్ గురు.. ‘ఈ-సైకిల్’ తయారు చేసిన ఇంటర్ స్టూడెంట్.. సింగిల్ ఛార్జ్ తో 80KM రేంజ్
గతంలో హైదరాబాద్ లో ఐటీ సంస్థలను ప్రోత్సహించేందుకు హైటెక్ సిటీని నిర్మించామాన్నారు. ఒక ఎకోసిస్టంను ఏర్పాటు చేయటం వల్లే ఇప్పుడు సైబరాబాద్ ప్రపంచానికి ఐటీ కేంద్రంగా మారింది. ఇంగ్లీష్, గణితం లాంటి కీలకమైన సబ్జెక్టుల్లో తెలుగు వారి నైపుణ్యాన్ని గుర్తించే ఇంజనీరింగ్ కళాశాలలను కూడా పెద్ద ఎత్తున స్థాపించాం. వీటితో పాటే ఐటీ కోర్సులను, సంస్థలను కూడా విస్తృతంగా ప్రోత్సహించాం. ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ఆదాయంలో 75 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది.. ఐటీ సెక్టార్ తో పాటు వేర్వేరు రంగాల్లో తెలుగు వారే కీలకంగా ఉన్నారని తెలిపారు.
Also Read:Yashasvi Jaiswal: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో యశస్వి!
కేవలం ఈ 25 ఏళ్లలోనే ఈ మార్పులన్నీ వచ్చాయి.. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మానవాళి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం మిళితం అయిపోయింది.. ఆర్ధిక సంస్కరణలు, సాంకేతిక సంస్కరణలు భారత ముఖ చిత్రాన్ని మార్చేశాయి.. అందులో నేను కూడా కీలక భాగస్వామిని కావటం నా అదృష్టం.. గతంలో లైటెనింగ్ కాల్ చేయాలన్నా 7 రోజులు పట్టేది.. అలాంటి సవాళ్లన్నీ దాటుకుని ఆధునిక సాంకేతిక యుగంలోకి అడుగుపెట్టాం.. ఇప్పుడు మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ముఖ్యమైన భాగస్వామిగా మారిందన్నారు.
Also Read:Yashasvi Jaiswal: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో యశస్వి!
యంగ్ ఇండియా మన దేశానికి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్.. క్వాంటం వ్యాలీ డీప్ టెక్నాలజీ ఇప్పుడు సరికొత్త విప్లవం.. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఏపీలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఏరో స్పేస్ టెక్నాలజీలో చాలా అవకాశాలు ఉన్నాయి.. ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ పుష్కలంగా ఉన్నాయి. డ్రోన్లు యుద్ధాలకు, పౌర సేవల కోసం ఉపయోగపడుతున్నాయి.. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నాం.. ఆగస్టు 15 నుంచి వంద శాతం పౌరసేవలు వాట్సప్ ద్వారానే అందిస్తామని తెలిపారు.
2026 జనవరి 1 నుంచి అమరావతి క్వాంటం వ్యాలీ పార్క్ పనిచేయటం ప్రారంభం అవుతుంది.. ఒక ఎకోసిస్టం కూడా ఏర్పాటు అవుతుంది. వంద యూజ్ కేసెస్ కూడా పరీక్షిస్తాం.. ఇతర దేశాలతో పోలిస్తే ఏఐ వినియోగం భారత్ లోనే ఎక్కువ ఉంటుంది.. డేటా లేక్ పై ఏపీ ప్రస్తుతం పనిచేస్తోంది. జియో ట్యాగింగ్, సర్వీస్ డెలివరీ, ఆన్ లైన్ ఫైల్స్, క్లౌడ్ డేటా ద్వారా పాలన జరుగుతోంది.. రియల్ టైమ్ డేటా కూడా అందుబాటులోకి వచ్చింది. సీసీ కెమెరాలు, సెన్సార్లు, వేరబుల్స్ ద్వారా సమాచారం వస్తోంది. వీటిని విశ్లేషించాలంటే క్వాంటం కంప్యూటింగ్ అవసరం.. 42 పారామీటర్ల సమాచారాన్ని కూడా సేకరించి విశ్లేషించే అవకాశం ఉటుంది.
Also Read:Indo-Pak Border: సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు లభ్యం.. మిస్టరీగా డెత్!
సాయిల్ మాయిశ్చర్ లాంటి అంశాలను క్వాంటం కంప్యూటింగ్ తో అనుసంధానిస్తే అద్భుతాలు చేయొచ్చు.. ఈ రంగాల్లో స్టార్టప్ లు కూడా వస్తే విస్తృతమైన అవకాశాలు ఉంటాయి.. ఫార్మా రంగంలోనూ విశేషమైన పరిశోధనలు సాగించవచ్చు.. భారత్- యూఎస్ అతిపెద్ద ప్రజా స్వామ్యాలు సుదీర్ఘకాలం పాటు కలసి పనిచేస్తాయి.. సాఫ్ట్‌వేర్ లో భారత్ బలంగా ఉన్నా ఉత్పత్తుల విషయంలో చాలా బలహీనంగా ఉన్నాం.. ఓ మిషన్ తీసుకువచ్చి అమరావతికి క్వాంటం కంప్యూటర్ వచ్చేసింది అనుకోవటం లేదు.. ఈ రంగంలో ఓ ఎకో సిస్టంను తీర్చిదిద్దుదాం.. యుద్ధానికి మనుషుల్ని పంపించటం పాత విషయం అయిపోయింది.
Also Read:Indo-Pak Border: సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు లభ్యం.. మిస్టరీగా డెత్!
ఇప్పుడు అంతా సాంకేతిక యుద్ధమే.. ఐక్య రాజ్య సమితి క్వాంటం కంప్యూటింగ్ సంవత్సరంగా ప్రకటించింది.. క్వాంటం శాటిలైట్ అందుబాటులోకి వస్తే మనకు ఎంతో లబ్ది చేకూరుతుంది.. సాధారణ పౌరుడి వరకూ కంప్యూటర్ సాంకేతికతను తీసుకెళ్లేలా గతంలో ప్రయత్నాలు చేశాం.. అందుకే చాలా మంది ఐటీ నిపుణులు ఇక్కడి నుంచి తయారయ్యారు.. గతంలో ఐటీ మంత్రులు కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉండేవారు.. ఇప్పుడు ఐటీ మంత్రిగా కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ ఉన్నారు.. ఆయనకు ఓ విజన్ ఇస్తున్నా క్వాంటం వ్యాలీ ద్వారా వాటిని సాధించాలి.. ఈ మూమెంటంలో అంతా భాగస్వాములు కావాలని అన్ని బహుళజాతి సంస్థలకూ పిలుపును ఇస్తున్నానన్నారు.
Also Read:Coolie : ‘చికిటు’ తెలుగు లిప్ సింక్ కోసం AI టెక్నాలజీ
ఇప్పుడే పెట్టుబడులతో ముందుకు రావాలని కోరుతున్నాను.. భారత్ లో ఉత్పత్తిని తయారు చేసి ఇక్కడి మార్కెట్ నే వాడుకోండి.. ఇన్నోవేషన్ కు ఆకాశమే హద్దు.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. అమరావతితో పాటు ఐదు ప్రాంతాల్లో ఈ తరహా హబ్ లను ఏర్పాటు చేశాం.. వాటిని వినియోగించుకోవాలని పరిశ్రమలను, స్టార్టప్ లను కోరుతున్నా.. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్ ను తయారు చేయాలని లక్ష్యం ఇచ్చాం.. క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతను మరో స్థాయికి చేరుస్తుంది.. నేను నిత్యవిద్యార్ధిని.. భవిష్యత్ సాంకేతికతను పాలనలో ఎలా సమ్మిళితం చేయాలన్నదే నా లక్ష్యం.. కేంద్ర సహకారంతో అన్ని లక్ష్యాలనూ సాధిస్తామని తెలిపారు.