నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు..
విజయవాడ: నేడు దుర్గమ్మకు బంగారు బోనం సమర్పణ. హైదరాబాద్ ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో బోనం.
జంటనగరాల్లో ఆషాఢ శోభ. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నుంచే బోనాల ఉత్సవాలు ఆరంభం. నగరంలో ఘనంగా రాష్ట్ర పండుగ బోనాల పండుగ ఉత్సవాలు.. ఇవాళ్టి నుంచి నాలుగు ఆదివారాలు జంటనగరాల్లో బోనాల సందడి. ఇవాళ గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి రెండోరోజు బోనాల సమర్పణ. గురువారం నాడు మొదటి బోనం సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం. వేలాదిగా గోల్కొండ కోటకు తరలిరానున్న భక్తులు. ఉదయం నుంచి రాత్రి వరకు గోల్కొండ కోట పైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించనున్న భక్తులు.
నేడు గాంధీభవన్‌లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతల భేటీ. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం. ఇంచార్జి మంత్రి పొన్నం.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం. జూన్ 4 న ఖర్గే సభ.. సన్నాహక సమావేశం.
నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. నిజామాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా. మధ్యాహ్నం ఒంటి గంటకి బేగం పేట ఎయిర్పోర్ట్ కు అమిత్ షా. 1.45 కి నిజామాబాద్ కి అమిత్ ష. 2 గంటల నుండి 2.30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. 2.45 నుండి 2.50 డీఎస్ (మాజీ పీసీసీ చీఫ్) విగ్రహ ఆవిష్కరణ. 2.45 నుండి 4 గంటల వరకు కిసాన్ మహాసభ. 4.15 కి నిజామాబాద్ నుండి బయలుదేరి 5 గంటలకు బేగం పేట ఎయిర్పోర్ట్. 5 గంటల నుండి 5.30 వరకు బేగం పేట ఎయిర్పోర్ట్ లో బీజేపీ కార్యకర్తలు కు అభివాదం. 5.30 కి బేగం పేట ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి అమిత్ షా.
వరంగల్ : భద్రకాళి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు. నేటితో 4వ రోజు కు చేరిన మహోత్సవాలు. ఉదయం కురుకుల్లా క్రమం,సాయంత్రం భేరుండా క్రమం అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు. నేడు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనం నిమిత్తం అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్న భక్తులు..
HYD: నేడు బేగంపేట్‌లో బంజారా ఆత్మీయ సమ్మేళనం. ఉదయం 11 గంటలకు టూరిజం ప్లాజాలో బంజారా ఆత్మీయ సమ్మేళనం. రాజకీయ ప్రాధాన్యత, కేబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్. సమ్మేళనంలో కార్యాచరణ నిర్ణయించనున్న బంజారా సంఘాలు.