‘ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు’.. ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ ‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను…
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. నేడు ప్రజలకు రేషన్ రైస్ పంపిణీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడంపై మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మీకు ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష?.. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు?.. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి…
కొందరు వివాదం కోసం మాట్లడుతుంటారు.. మరికొందరు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోదామని వాయిస్ పెంచుతుంటారు. కానీ... వాటన్నిటితో సంబంధం లేకుండా... మనసులో ఏది ఉంటే అది మాట్లాడి.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా జేసీ బ్రదర్స్ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు తుస్సుమంది అంటూ సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ప్రసంగం మొత్తం అభద్రతాభావం కనిపించింది.. కడప మహానాడు తుస్సుమంది.. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్ లను తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాల సమయంలో కూడా జగన్ ను తిట్టించటం కింద నవ్వుకోవటం.. మేం మీ మీద ఇలా మీ మీద మాట్లాడలేమా..? అని ప్రశ్నించారు.. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు..
రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అని సీఎం చంద్రబాబు అన్నారు.
CM Chandrababu: జన సముద్రంతో కడప నిండిపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి చేస్తే ప్రజలు అండగా ఉంటారని కడప ప్రజలు నిరూపించారు.. ఉదయం నుంచి అన్ని దారులు కడప వైపే చూస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగిన మొదటి మహానాడు సూపర్ హిట్ అయింది..
అర్ధిక అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు తన మనుషులకే మేలు చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మహమ్మారి కరోనా సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారని, చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరుగారి పోయాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదలచుకున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ మహానాడు బహిరంగ సభ తర్వాత కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తాజ్ హోటల్లో జరిగే సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య ఈ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను బాబు కలిసే అవకాశముంది. యోగా దినోత్సవంకు…
14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..! తెలుగు చిత్రసీమలో మరోసారి సినీ అవార్డులతో వేదిక వెలుగులు నింపనుంది. 14 సంవత్సరాల విరామం తర్వాత ఉత్తమ తెలుగు సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఒక మహత్తరమైన గౌరవంగా భావిస్తున్నారు తెలంగాణ సినీ ప్రేమికులు. ఈ…
కడప: నేడు మూడో రోజు టీడీపీ మహానాడు. ఐదు లక్షల మందితో టీడీపీ బహిరంగ సభ. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి కడప నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. రేపు సీఐఐ వార్షిక సమావేశానికి హాజరుకానున్న సీఎం. రేపు రాత్రి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస. నేడు ఢిల్లీకి టి.కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. ఖర్గేను కలవనున్న మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు. కేబినెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్న ఎమ్మెల్యేలు. హైదరాబాద్: నేడు బాచుపల్లిలో…