CM Chandrababu: టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి పేరుతో రాజకీయాలు మర్చిపోయాం.. దీంతో మనపై దుష్ప్రచారం చేశారు.. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఏమి చేశామో చెప్పాలి అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు వివరించాలి.. గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.. కానీ, గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు.. కనీసం కేంద్ర పథకాలు కూడా ఉపయోగించలేదు.. ప్రస్తుతం మనం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగు వేస్తున్నాం.. అన్ని చేశామని చెప్పడం లేదు.. అందుకే తొలి అడుగు అన్నాము.. రాష్ట్రంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని సహకరించారు అని చంద్రబాబు తెలిపారు.
Read Also: ENERepeat : టీమ్ కన్యారాశి మళ్ళి వస్తోంది.. ఈ నగరానికి ఏమైంది – 2 స్టార్ట్
ఇక, టీడీపీ ఎప్పుడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెయ్యదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారం మనకు ముఖ్యం కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. ఏ రాజకీయ పార్టీకి రాని అవకాశాలు మనకు వచ్చాయి.. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక పరిస్థితి బయటకు వచ్చే వాతావరణం లేదు.. ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికి ఎన్నో చేస్తున్నాం.. దక్షిణ భారత రాష్ట్రాల్లో మనది విభిన్న పరిస్థితి.. రాష్ట్ర ఆదాయంలో సర్వీసు సెక్టార్ ఎక్కువ.. దీపం పథకంలో ఇప్పటికే సిలిండర్ పంపిణీ జరుగుతోంది.. పొగాకు కొనేవారు లేకపోతే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాం.. పామాయిల్ మిర్చి ఇలా ప్రతి రైతులకు న్యాయం చేస్తున్నాం.. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Sreeleela: శ్రీలీల.. ఇలాగైతే కెరీర్ నాశనమే!
అయితే, అన్నా క్యాంటీన్ లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వచ్చే నెల అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు అందుతాయి.. అమరావతికి ఇప్పటికే రూ. 15 వేల కోట్ల నిధులు వచ్చాయి.. అమరావతి పనులు ట్రాక్ లో పడ్డాయి.. 2027కి పోలవరం జాతికి అంకితం అవుతుంది.. స్టీల్ ప్లాంట్ ను కూడా లాభాల బాట పెట్టే పరిస్థితి వచ్చింది.. కృష్ణ పట్నం పోర్ట్ పనులు ప్రారంభం అవుతున్నాయి.. ఆగస్ట్ 15 నాటికి 700 సర్వీస్ లు ఆన్ లైన్ లో ఉంటాయి.. టీడీపీ చేసే సర్వేలు ఎవరు చెయ్యరు.. అన్ని స్థాయిల్లో ఇప్పటికే సర్వేలు జరిగాయి.. మనం ఏమనుకుంటున్నామనేది ముఖ్యం కాదన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ముఖ్యం.. ఒకరు చేసిన పనులు చెప్పగలరు.. దీని వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Kayadu Lohar : ఒకే ఒక్క హిట్ తో కయాదు లోహర్ దశ తిరిగింది
కాగా, టీడీపీ ఒక కుటుంబం.. ఎర్రంనాయుడు పార్టీకి పని చేస్తే ఆయన కుమారుడు కేంద్రమంత్రి అయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బాలయోగి చనిపోయినప్పుడు ఆయన కుమారుడు చిన్నవాడు.. కానీ ఇప్పుడు ఎంపీ అయ్యారు.. కుప్పంలో కార్యకర్తలు సరిగ్గా లేకపోయినా చర్యలు ఉంటాయి.. వెయ్యి, రెండు వేల నోట్లను రద్దు చేయాలని నేనే చెప్పాను.. రూ. 500 నోట్లు కూడా రద్దు చేయాలని తెలిపాను.. డబ్బులతోనే గెలుస్తామంటే కుదరదు అన్నారు. మొన్న ఎన్నికల్లో వాళ్లకి 11 మాత్రమే వచ్చాయి.. మన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు.. సమర్థమైన పాలన వల్లే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. రాష్ట్రాన్ని ఐదు జోన్లగా విభజించి అభివృద్ధి చెయ్యాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.