కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది చాలా కీలక పాత్ర.. పాలసీ మేకింగ్, వాగ్దానాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ అన్నిటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కూటమిలో జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది.. ప్రజలకోసం కూటమికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్..
విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ రోజు విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం ఎయిర్పోర్ట్) టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది…
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సర్కార్ ఏర్పాటై రేపటికి ఏడాది పూర్తి అవుతుంది. స్వపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్ పేరుతో అమరావతిలో రాష్ట్ర స్థాయి సభ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మా ప్రభుత్వ హయాంలో అవినీతి రహిత, పారదదర్శక పాలన ఆందించాం.. విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం.. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసపూరితంగా వ్యవహరిస్తోంది.. రెడ్ బుక్ పాలనతో ప్రభుత్వాన్ని అస్తవ్యస్తంగా మార్చారు.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్ధుడు చంద్రబాబు.. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టి మళ్లించటానికి రాష్ట్రంలో…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. రాష్ట్ర స్థాయి వేడుకగా కూటమి ఏడాది పాలన నిర్వహించాలని నిర్ణయించారు.. జూన్ 12వ తేదీన అంటే ఎల్లుండి సాయంత్రం ఈ వేడుకలు నిర్వహించనున్నారు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం సమీక్షించారు. రెండు ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు.
యువత పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని, అందుకు అవసరమైన ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సద్విని చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. సోమవారం రామచంద్రపురంలోని విజయ్ ఫంక్షన్ హాల్ లో కోనసీమ స్టార్టప్ సమ్మిట్ పేరుతో జరిగిన స్కిల్ డెవలప్మెంట్, పరిశ్రమల స్థాపనపై జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తామని తెలిపారు.ఆగస్ట్ 15న ఉచిత బస్ పథకం మహిళలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ మనసుపెట్టి పనిచేయాలని, పొలిటికల్ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వచ్చాంద్ర అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు. 175 నియోజక వర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో సీఎం…