మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఏపీలో పొలిటికల్ రచ్చ సాగుతూనే ఉంది.. ఈ అంశంపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు.. చరిత్ర చెరిపేస్తే చెరగదు.. రాష్ట్ర చరిత్రలో ఒకేరోజు ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించిన ఘనత మా నాయకుడు జగన్ కే దక్కుతుందన్నారు..
అస్సాంలో భారీ భూకంపం.. ఉత్తర బెంగాల్, భూటాన్‌లోనూ ప్రకంపనలు! అస్సాంలోని గువాహటిలో 5.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర బెంగాల్, పొరుగున ఉన్న భూటాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం కొద్ది రోజుల క్రితమే.. అంటే సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో కూడిన మరో భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సంభవించింది.…
వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచకుడు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన తెలుగు టీచర్ కొందరి ఉపాధ్యాయుల తీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్స్ తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రవర్తనతో, చేష్టలతో అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచార యత్నాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా ములుగు (మం) లక్ష్మక్కపల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచక టీచర్ బాగోతం…
జిల్లా ఎస్పీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు.. శాంతి భద్రతలకు ప్రాధాన్యం... పెట్టుబడులకు అదే కీలకం అని స్పష్టం చేశారు.. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి అని ఆదేశించారు..
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయన్నారు.
పెద్ద ఎత్తున ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది ప్రభుత్వం.. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు రాగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు.. ఇక, 12 జిల్లాల్లో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించింది ప్రభుత్వం..
టీడీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వన్ టు వన్ మీటింగ్స్‌తో కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక వీలున్నప్పుడల్లా నలుగురైదుగురు శాసనసభ్యులను పిలిచి క్లాస్ పీకుతున్నారు.
ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, బీజేపీ మిత్ర పక్ష ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలంతా హాజరయ్యారు. అలాగే మాజీ ఉప రాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధన్కర్ దంపతులు, తదితరలంతా హాజరయ్యారు. సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు…