నేడు వెల్దుర్తికి సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కొడుకు గౌతంరెడ్డి వివాహ రిసెప్షన్లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
మొంథా తుఫాన్ హెచ్చరికలతో పర్యాటక కేంద్రాలు క్లోజ్.. కైలాసగిరి సహా బీచ్ రోడ్డులో ఉన్న సందర్శన స్థలాల మూసివేతకు VMRDA నిర్ణయం.. నేడు, రేపు కైలాసగిరిపై కేబుల్ కార్, అడ్వెంచర్ స్పోర్ట్స్ నిలిపివేయాలని ఆదేశం
నేటి నుంచి మూడు రోజుల పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన 2 జిల్లాల కలెక్టర్లు
నెల్లూరులోని వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చేరుకున్న నాలుగు మృతదేహాలు.. ఈరోజు రమేష్, అనూష, ఇద్దరు చిన్నారుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబ సభ్యులు.. నాలుగు రోజుల క్రితం కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు
నకిలీ మద్యం తయారీ కేసులో ఐదుగురు నిందితుల కస్టడీ పిటిషన్లు మీద నేడు ఎక్సైజ్ కోర్టులో విచారణ.. కేసులో ఏ7 బాదల్ దాస్, ఏ8 ప్రదీప్ దాస్, ఏ15 రమేష్, ఏ16 అల్లా భక్షు, ఏ17 సతీష్ బాబులను 10 రోజులు కస్టడీ కోరుతూ అధికారుల పిటిషన్.. నేడు విచారణ చేయనున్న న్యాయస్థానం
నేడు ఏలూరులో ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన.. ‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
మొంథా తుఫాన్ నేపథ్యంలో నేటి నుంచి గుంటూరు జిల్లాలో మూడు రోజులపాటు విద్యా సంస్థలకు సెలవులు.. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం
నేడు మద్యం షాపులకు డ్రా ఏర్పాటు చేసిన ఎక్సైజ్ శాఖ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలకు లాటరీ తీయనున్న కలెక్టర్లు.. కలెక్టర్ల చేతుల మీదుగా ఈరోజు ఉదయం 11 గంటలకు జరగనున్న మద్యం షాపుల డ్రా ప్రక్రియ
ఆటో డ్రైవర్ సమస్యలపై పోరాటానికి సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ.. ఇవాళ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆటోలలో ప్రయాణించి వారి సమస్యలు అడిగి తెలుసుకొనున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. ఎర్రగడ్డలో ఆటోలో ప్రయాణించనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
నేడు బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ మొదటి టీ20 మ్యాచ్.. బిర్ శ్రేష్ఠో ఫ్లైట్ లెఫ్టినెంట్ మాటియుర్ రెహమాన్ స్టేడియంలో సాయత్రం 5.30కు మ్యాచ్ ఆరంభం
నేడు కార్తీక సోమవారం.. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు