రేపు ( గురువారం) రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు అని మంత్రి నారాయణ తెలిపారు. కూల్చేసిన ప్రజావేదిక దగ్గర నుంచి పర్యటన ప్రారంభమవుతుందన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..పథకాల అమలు, పేర్లు కొనసాగింపునకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది. గత సర్కార్ ప్రవేశ పెట్టిన పథకాల పేర్లను మార్చింది. 2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అందుకు అనుగుణంగా అనేక పథకాలను కూడా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
రెండ్రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్యాలయంలో తూనికలు కొలతలు విభాగపు అధికారులతో సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ నాదెండ్ల సమీక్షించారు.
ఏపీలో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూటమి నేతలు చర్చలు జరుపుతున్నారు.