AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 27.28 గంటల పాటు సభ
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా..
- 16వ శాసన సభ మొదటి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు..
- ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు..
- మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ కార్యక్రమాలు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.. 16వ శాసన సభ మొదటి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు.. శాసన సభలో సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని.. అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటిగా పేర్కొన్నారు..
Read Also: HMD Crest: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లతో ఫోన్స్‌ను విడుదల చేసిన ఎచ్ఎండి..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక, శాసనసభలో సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు ప్రకటనలు చేసినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.. ప్రవేశపెట్టిన బిల్లులు 2 కాగా.. ఆమోదం పొందిన బిల్లులు కూడా 2గా వివరణ ఇచ్చారు.. మొత్తం శాసన సభలో 68 మంది సభ్యులు ప్రసంగించారని వెల్లడించారు.. 344 నిబంధన కింద ఒక చర్చ కూడా సాగిందన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. కాగా, ఈనెల 22 నుంచి ప్రారంభమైన సమావేశాలు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఐదు రోజుల పాటు కొనసాగాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల్లో పాల్గొన్నారు.. ఇక, సభ ప్రారంభమైన రోజు మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు , వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి సమావేశాలు హాజరుకాగా.. రాష్ట్రంలో ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తుందని ఆరోపిస్తూ కేవలం 15 నిమిషాల వ్యవధిలోనూ అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేసి వెళ్లిపోయిన విషయం విదితమే..
Read Also: Snake vs centipede: పాముతో జెర్రి బిగ్ ఫైట్.. చివరకు?
గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగాయి.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఆ తర్వాత మద్యం పాలసీ, శాంతి భద్రతలు, ఆర్థికశాఖలపై చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ.. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకే.. శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!