CM Chandrababu: కలెక్టర్ట కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదన్న సీఎం.. ఏపీలో మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే.. 1000 కిలో మీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు దండే పేర్కొనడంపై స్పందిస్తూ.. 1000 కిలో మీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు. అధికారులకు ఇంకా మూస పద్దతిలోనే వెళ్తున్నారన్న సీఎం.. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలతో వెళ్తోంటే దాన్ని అందిపుచ్చుకోలేక పోతున్నారని.. రైల్ ఓవర్ బ్రిడ్జిలపై కాంతి లాల్ దండే తన ప్రజెంటేషనులో ప్రస్తావించ లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు..
Read Also: Mallu Bhatti Vikramarka: మధిరలో ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రం.. రింగ్ రోడ్ల నిర్మాణాకి ప్రణాళికలు..
ఇక, అటవీ శాఖ అధికారుల తీరుపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలోనే అటవీ శాఖ అధికారుల తీరును ప్రస్తావిస్తున్నానన్న ఏపీ సీఎం. అటవీ శాఖ వద్ద భారీ ఎత్తున ఫైళ్లు పెండింగులో ఉన్నాయన్నారు.. అటవీ సంపదను దోచుకెళ్తోంటే చూస్తూ ఉంటున్న అటవీ అధికారులు.. ఓ రోడ్ నిర్మించాలంటే మాత్రం అనుమతులివ్వడం లేదన్నారు.. చంద్రబాబు కామెంట్లతో ముసి ముసిగా నవ్వుకున్నారు పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వం భారీ ఎత్తున దోచేశారన్న చంద్రబాబు. మరోవైపు.. చీరాలలో చేనేత దినోత్సవం చేపడుతున్నామన్నారు.. చీరాల కాదు.. విజయవాడలో పెట్టామన్న చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి సునీత. ఏమమ్మా.. చీరాల రావడానికి ఏమైనా ఇబ్బందా..? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.. ఎలాంటి కార్యక్రమాన్నైనా రూరల్ ప్రాంతాల్లోనే పెట్టాలని స్పష్టం చేశారు.. అజెండా హెవీగా ఉందా.. అంటూ అధికారులను నవ్వుతూ ప్రశ్నించిన సీఎం. ఇవన్నీ రెగ్యులర్‌గా మీరు చేసే పనులే.. అలవాటు తప్పడం వల్ల హెవీగా ఉన్నట్టు అనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు.. త్వరలోనే పని చేయడం అలవాటు అవుతుందని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు.