District Collectors Conference: సీఎం నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభం.. పదేళ్లలో ఇదే తొలిసారి..
- ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం..
- ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం..
- హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి సిద్ధమైన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
District Collectors Conference: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం ఇదే.. ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి సిద్ధమైంది సర్కార్.. ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.. ప్రజలకు సేవలందించే విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేయనున్నారు.. ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడే తిప్పి కొట్టాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందంటున్నారు.. తాను జిల్లాల పర్యటనలకు వచ్చేటప్పుడు అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకోవద్దని.. ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని మరోసారి స్పష్టం చేయబోతున్నారు సీఎం..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే, ఈ కలెక్టర్ల సమావేశానికి ఓ ప్రత్యేకత ఉంది.. విభజన జరిగిన పదేళ్ల కాలంలో తొలిసారి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది.. 2014-19 మధ్య కాలం తొలి రోజుల్లో హోటళ్లల్లో, ఆ తర్వాత ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించేవారు.. ఇక, గత ప్రభుత్వంలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు అప్పటి సీఎం.. గత ప్రభుత్వంలో తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ప్రజా వేదికలో నిర్వహించిన నాటి సీఎం జగన్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజా వేదికను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సచివాలయంలో సరైన వేదిక లేకున్నా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.. ఫంక్షన్ హాళ్లు.. హోటళ్లల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి అంగీకరించని సీఎం చంద్రబాబు.. అనవసరపు ఖర్చు వద్దని స్పష్టం చేశారు.. సచివాలయంలోనే సర్దుకుని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని సీఎం చెప్పడంతో.. సచివాలయంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!