Minister Narayana: గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణపనులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు ఆ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ.. అమరావతి రాజధాని నిర్మాణం మరో మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ప్రకటించారు.. ఇక, సీఆర్డీఏ బిల్డింగ్ అప్పటి మా ప్రభుత్వంలోనే పూర్తి అయ్యిందన్నారు.. ఇంకా, మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడానికే ఈ పునః ప్రారంభం అన్నారు..
Read Also: Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. వరుసగా నాలుగోరోజు పెరిగిన బంగారం ధరలు!
ఇక, సీఆర్డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టిన వారికి భూములిచ్చాం అన్నారు మంత్రి నారాయణ.. పెట్టుబడులు పెట్టిన వారికి మౌళిక వసతులు అవసరం.. ట్రంక్ రోడ్లు, కాలువలు, నీరు వంటి వసతులు కల్పిస్తాం అని వెల్లడించారు.. అన్ని టెండర్లు నిర్ణీత సమయంలో పూర్తవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. జనవరి నాటికి టెండర్లు పూర్తి చేసి పనులు జరిపిస్తాం అన్నారు అన్నారు మంత్రి పొంగూరు నారాయణ. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణ పనులు జరగగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. మూడు రాజధానుల స్టాండ్ తో.. అమరావతి నిర్మాణ పనులను పక్కనబెట్టిన విషయం విదితమే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ నిర్మాణ పనులను ఫోకస్ పెట్టింది..