CM Chandrababu Serious: సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. అయితే, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ సాగినట్టుగా తెలుస్తుండగా.. మంత్రులతో చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు.. మంత్రులు ప్రో యాక్టివ్ గా పని చేయలని స్పష్టం చేశారు.. మంత్రులు స్పీడ్ పెంచాలి, అదే సమయంలో సమర్ధంగా పని చేయాలంటూ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు.. ఇక నుంచి ప్రతిరోజు ముఖ్యమేనంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.. మంత్రులు కూడా తనతో సమానంగా పని చేయగలగలన్న చంద్రబాబు.. ఇంకా కొందరు నిర్లిప్తంగా ఉన్నారని.. ఇలా ఉంటే పని చేయలేరంటూ మంత్రులకు హితవు చెప్పారు.
Read Also: The RajaSaab Motion Poster: బర్త్‌డే ట్రీట్ అదిరిందిగా.. ‘రాజాసాబ్’ సరికొత్తగా ఉన్నాడు!
కాగా, కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇక, మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది.. మరోవైపు.. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో.. ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్ల బండ్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.. ఉచిత ఇసుక పూర్తిగా ఉచితం చేసింది ప్రభుత్వం..