AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభమైన సమావేశం.. మధ్యాహ్నం 1.30 తర్వాత ముగిసింది.. ఇక, కేబినెట్ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇక, కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇక, మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది.. మరోవైపు.. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో.. ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్ల బండ్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.. ఉచిత ఇసుక పూర్తిగా ఉచితం చేసింది ప్రభుత్వం..
Read Also: IND vs NZ: జట్టును సోషల్ మీడియా ఎంపిక చేయదు.. గంభీర్ కీలక వ్యాఖ్యలు!