రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకమని.. టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి.. తాజాగా కడపలో.. అనకాపల్లిలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.
లిప్ట్ స్కీమ్ల నిర్వహణ, మోటార్ల మరమ్మత్తులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా వైఎస్ జగన్ ఎత్తిపోత పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. 1,040 లిఫ్ట్ స్కీమ్లకు గాను 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయని ఆరోపించారు.. ఇక, తాళ్లూరు లిఫ్ట్ పైపులు సిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే.. పుష్కర మెయిన్ కెనాల్ తాళ్లూరు లిఫ్ట్ బ్లాక్ కాటన్ సాయిల్ కావడం వల్ల బ్రేక్ అవుతోందన్నారు.
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
నిరుద్యోగులకు శాసన సభ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా తేడా లేకుండా వరుసగా అఘాయిత్యాలు వెలుగు చూశాయి.. అయితే, మహిళలపై అత్యాచార ఘటనలపై సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మహిళలపై అత్యాచార ఘటనలపై సహించేది లేదని హెచ్చరించారు.. పిల్లల తప్పు కూడా ఉండదు... మనమే మానసికంగా సరిదిద్దాలని సూచించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది.. సాయంత్రం 4గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు.
ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 24న ఆల్ పార్టీ మీటింగ్ ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. నవంబర్ 24న ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్ అనెక్స్లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈరోజు (మంగళవారం)…