వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా భయపెట్టడమే కాకుండా బెదిరించారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి తనతో చర్చకు రావాలని, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదని ఎంపీ నాగరాజు సవాల్ చేశారు.
ఢిల్లీలో ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ… ‘విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవి రావును అప్పట్లో బాగా భయపెట్టారుఎం బెదిరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారు. ఢిల్లీలో కూర్చుని మాట్లాడినంత మాత్రాన అన్నీ నిజాలైపోవు. మా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గురించి చాలా దిగజారి మాట్లాడారు. మీ హయాంలో వేల కోట్లు అప్పులు చేసి.. రాష్ట్రం దివాలా తీసేలా చేశారు. విజయసాయి రెడ్డి.. నాతో చర్చకు కూర్చో, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది’ అని ఫైర్ అయ్యారు.
‘ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ పేరుతో రైతుల భూమి కాజేయాలని చూశారు. మేము సరిదిద్ది రైతుల భూములను కాపాడాం. కేవీ రావును మీ హయాంలో చాలా భయపెట్టారు. ఢిల్లీలో కూర్చుంటే సరిపోదు. మీ అరాచకాలన్నీ బయటకు వస్తాయి, సిద్ధంగా ఉండండి. ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదు. ఒక రెండు సీట్లు తగ్గి ఉంటే వైసీపీకి ‘నవ రత్నాలు’ మిగిలేవి. కాకినాడ పోర్టులో చాలా అక్రమాలు జరిగాయి. నిదానంగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి’ అని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.