CM Chandrababu : నేడు బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్, అండ్ టీచర్స్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. స్వీయ క్రమ శిక్షణ, వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించాలని, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పాఠశాలల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను సీఎం చంద్రబాబు సత్కరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా శనివారం బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు. ట్రాఫిక్ మళ్లింపుపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. చీరాల నుంచి బాపట్ల మీదుగా పొన్నూరు, గుంటూరు వైపు వెళ్లే వాహనాలను, అంబేడ్కర్ సర్కిల్, జమ్ములపాలెం ఫ్లైఓవర్, ఉప్పరపాలెం ఇందిరాగాంధీ సర్కిల్, దర్గా మీదుగా దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు
అంతేకాకుండా..’బాపట్ల నుంచి కర్లపాలెం, చెరుకుపల్లి, రేపల్లె వైపు వెళ్లు వాహనాలను గడియార స్తంభం సెంటర్, రాష్ట్రీయ రహదారి 216 మీదుగా దారి మళ్లిస్తున్నారు. గుంటూరు, పొన్నూరు వైపు నుంచి బాపట్ల పట్టణంలోకి వచ్చే వాహనాలను గుంటూరు ఫ్లైఓవర్ కుడి వైపు నుంచి కలెక్టర్ బంగ్లా, దర్గా, ఉప్పరపాలెం రైల్వే గేట్, ఉప్పరపాలెం ఇందిరాగాంధీ సర్కిల్, జమ్ములపాలెం ఫ్లైఓవర్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా దారి మళ్లించారు. రేపల్లె, చెరుకుపల్లి, కర్లపాలెం వైపు నుంచి బాపట్ల పట్టణంలోకి వచ్చే వాహనాలు రాష్ట్రీయ రహదారి 216 మీదుగా సూర్యలంక రోడ్డులోకి వచ్చి గడియార స్తంభం సెంటర్ మీదుగా దారి మళ్లించారు. ఉప్పరపాలెం రైల్వే గేట్, ఆర్ అండ్ బీ బంగ్లా మీదుగా మున్సిపల్ ఉన్నత పాఠశాల వైపు వచ్చు వాహనాలు ఉప్పరపాలెం ఇందిరాగాంధీ సర్కిల్, జమ్ములపాలెం ఫ్లైఓవర్ మీదుగా దారి మళ్లించారు. ఆర్ అండ్ బీ బంగ్లా మీదుగా ఉప్పరపాలెం వైపు వెళ్లే వాహనాలను పాత బస్టాండ్ సెంటర్, గడియార స్తంభం సెంటర్, జమ్ములపాలెం ఫ్లైఓవర్, రైల్వే ట్రాక్ ప్రక్క నుంచి ఉప్పరపాలెం ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం పర్యటన ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు.
Jawan Suicide: లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య