Minister Narayana: కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం యూడీఏలపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. ఆయా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (యూడీఏ) పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేశారు మంత్రి నారాయణ.. ఈ సమశానికి మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, డైరెక్టర్ హరినారాయణన్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, ఈఎన్ సీ మరియన్న, మూడు యూడీఏల వీసీలు, మున్సిపల్ కమిషనర్లు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు..
Read Also: Kadambari Jethwani Case: ముంబై నటి జత్వాని కేసులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..
ఇక, ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఆధ్వర్యంలో ఎంఐజీ, హెచ్ ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు.. ఈ నెలాఖరు నాటికి అవసరమైన స్థలాలు గుర్తించాలని మూడు యూడీఏల వీసీలకు ఆదేశాలు జారీ చేవారు.. భవన, లేఅవుట్ల అనుమతులను సులభతరం చేశామని.. యూడీఏల ఆదాయంలో 50 శాతం మున్సిపాల్టీల అభివృద్దికి కేటాయిస్తామన్నారు.. యూడీఏలకు నోడల్ అధికారిగా పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్‌ను నియమించామన్నారు.. అయితే, యూడీఏలకు ఆదాయం వచ్చేలా టూరిజం ప్రాజెక్ట్ లపై దృష్టి సారించాలని ఆదేశించారు మంత్రి పొంగూరు నారాయణ.