AP School Education: ఏపీ విద్యాశాఖ వినూత్న నిర్ణయం.. దేశంలోనే తొలిసారి..!
- ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ వినూత్న కార్యక్రమం..
- దేశంలో ఎక్కడా జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్..
- ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్..
- 44,303 పాఠశాలల్లో ఒకేరోజు మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP School Education: ఆంధ్రప్రదేశ్‌లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది విద్యాశాఖ.. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది అంటున్నారు.. పాఠశాల విద్యాశాఖ సెక్రెటరీ కోన శశిధర్.. ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తాం.. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహణ ఉందన్నారు.. 38,319 మండలపరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు.. 2,807 మునిసిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్, 2843 ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ సమావేశం నిర్వహించనున్న్టు వెల్లడించారు.. కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు..
Read Also: Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
పిల్లలు స్వయంగా తయారు చేసిన ఇన్విటేషన్ కార్డులు తలిదండ్రులకు ఇప్పించామని తెలిపారు కోన శశిధర్.. మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీయేనన్న ఆయన.. HOLISTIC PROGRESS CARD పిల్లలకు నచ్చే విధంగా తయారుచేశాం.. ప్రతి విద్యార్ధి గురించి ఉపాధ్యాయులు స్వయంగా రాస్తారు.. ప్రతీ పేరెంట్ కి Holistic Progress Card ఉపాధ్యాయులు స్వయంగా ఇవ్వడం ద్వారా ఇద్దరి మధ్య అనుసంధానం కలిగిస్తున్నాం.. తల్లులకు ఒక రంగోలీ పోటీ, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తాం.. 900 స్కూళ్లలో హెల్త్ స్క్రీనింగ్ చేశాం.. మిగిలిన స్కూళ్లలో కూడా జరుగుతుందని తెలిపారు.. ఇక, పూర్వ విద్యార్ధులు, ప్రస్తుత విద్యార్థులు, తలిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు ఉండగా ఒక యాక్టివ్ గా ఉండే తల్లులతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించాం.. విద్య, సదుపాయాలపై స్కూల్‌కు స్టార్ రేటింగ్ ఇస్తాం అన్నారు..
Read Also: RTC Driver Meets Nara Lokesh: ‘దేవర’ పాటకు స్టెప్పులేశాడు.. మంత్రి లోకేష్‌ని కలిశాడు..
ఇక, పూర్వ విద్యార్ధులు, డోనార్లు ఉంటే వారి నుంచి డొనేట్ చేయిస్తాం అన్నారు పాఠశాల విద్యాశాఖ సెక్రెటరీ కోన శశిధర్. ఎవరైనా జీవితంలో స్ధిరపడిన పూర్వ విద్యార్ధితో మాట్లాడిస్తాం.. పేరెంట్ ఇచ్చే సూచన, కంప్లైంట్ కూడా తీసుకుంటాం.. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే భోజనం తలిదండ్రులు అందరికీ ఇస్తాం.. మధ్యాహ్న భోజన పథకం పై తల్లిదండ్రుల సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు.. మరోవైపు.. ఈ పొలిటికల్ బ్యానర్లు ఏవీ ఈ కార్యక్రమంలో ఉండబోవని స్పష్టం చేశారు.. సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల స్కూల్‌లో కార్యక్రమంలో పాల్గొంటారు.. ప్రతీ ఎమ్మెల్యే, ప్రతీ మంత్రి వారి నియోజకవర్గాల్లో పాల్గొనాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు.. మొత్తంగా ఏపీ విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..