Bhagwant Mann Says PM Modi’s January Security Breach Incident Unfortunate: పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. బుధవారం పంజాబ్ లో పర్యటించారు ప్రధాని మోదీ. చండీగఢ్ లో మోహాలిలోని ముల్లన్ పూర్ లోని 300 పడకల హోమీ బాబా కాన్సర్ ఆస్పత్రి, పరిశోధనా కేంద్రాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు.
గత జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన ఘటనపై సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు. ఈ ఘటన దురదృష్టకరమైనదని అన్నారు. జనవరిలో ఫిరోజ్ పూర్ పర్యటనలో భాగంగా పంజాబ్ వెళ్లిన ప్రధాని కాన్వాయ్ కొంత సేపు ఓ ఫ్లై ఓవర్ పై ఉండటం అప్పట్లో వివాదానికి తావిచ్చింది. ఆ సమయంలో ఫిరోజ్ పూర్ లో నిరసనకారులు అడ్డుకోవడంతో ప్రధాని కాన్వాయ్ ఫైఓవర్ పై నిలిచిపోయింది. దీంతో ప్రధాని ఢిల్లీకి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ భద్రతా ఉల్లంఘనలపై విచారణ కోసం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది.
Read Also: Lady Doctor Incident: హిందూపురంలో లేడీ డాక్టర్ అనుమానాస్పద మృతి
బుధవారం జరిగిన సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. కాన్సర్ ఆస్పత్రి రాష్ట్రానికి పెద్ద బహుమతి అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో అత్యున్నత రత్నం పంజాబ్ అని సీఎం భగవంత్ మాన్ అన్నారు. గత ప్రభత్వం వైఫల్యం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉండేదని.. ఇప్పుడు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఆయన అన్నారు. మీరు జనవరి 5న ఇక్కడికి వచ్చినప్పుడు మీ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని.. ఇది దురదృష్టకరం అని.. కానీ ఈ రోజు పంజాబ్ మీకు స్వాగతం పలుకుతోందని.. మీరు ఈ దేశ ప్రధాని, మీకు స్వాగతం పలకడం మా బాధ్యత అని సీఎం భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్ కోసం హామీలు ప్రకటించాలని ప్రధానిని కోరారు.