కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఇక, కమలం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది.. ఆయన వ్యాఖ్యలు కూడా ఇక, తాను కాంగ్రెస్‌ను వీడడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు.. ఈ తరుణంలో బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. రాజగోపాల్‌రెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.. అమిత్‌షాతో భేటీ.. కాంగ్రెస్‌పై తాజాగా ఆయన చేసిన కామెంట్ల నుంచి.. ఇతర అంశాలపై కూడా చర్చ సాగినట్టుగా తెలుస్తుండగా.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. తగ్గేదే లే అనే తరహాలో కామెంట్లు చేశారు.. తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డ కోమటిరెడ్డి.. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు చప్పట్లు వచ్చినంత ఈజీగా ఓట్లు రాలవని.. సినిమా డైలాగులకు ఓట్లు రావని పేర్కొన్నారు..
భట్టి విక్రమార్క నాకు అన్న లాంటి వ్యక్తి.. తనతో ప్రత్యేకంగా మాట్లేందుకు వచ్చారని ఆయనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భట్టి తాను అన్నదమ్ముల్లాగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు తానెక్కడ దూరం అవుతానేమోనన్న ఆవేదనతో భట్టి వచ్చారని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సిఎల్పీ గా నేను కూడా కావాలని అనుకున్న.. అవకాశము ఇస్తే .. పార్టీ కోసం గొంతుక అవుతా అని చెప్పానని గుర్తుచేసుకున్నారు.. ఇక, భట్టి మంచి నాయకుడు.. ఓపిక, వ్యక్తిత్వం ఉన్న మనిషి.. సీఎల్పీ ఆయనకే ఇవ్వండి అని కూడా చెప్పానన్నారు.. నాకు సీఎల్పీ ఇవ్వకపోయినా కలిసి పని చేస్తా అన్నారు.. అయితే, పీసీసీ మార్పు కూడా వెంటనే చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉత్తమ్ కుమార్‌రెడ్డిని వెంటనే మారుస్తారు అనుకున్నాను.. 12 మంది ఎమ్మెల్యే లు పోతే కూడా పట్టించుకోలేదు అధిష్టానం అని మండిపడ్డారు.. ఇక, నేను కన్ఫ్యూజ్ కాలేదు.. క్లారిటీతో చెప్పినా.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి… టీఆర్ఎస్‌ని ఒడిస్తారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు..
మరోవైపు.. మంత్రి జగదీశ్వర్‌రెడ్డిపై ద్వజమెత్తారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. తాను మునుగోడుకు ఒక్కసారి వెళ్లినా.. జగదీశ్వర్ రెడ్డి వందసార్లు వెళ్లినా ఒక్కటే అన్నారు.. కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇచేస్తుందుకు మంత్రి వెళ్లాల్సిన అవసరముందా..? అని నిలదీశారు.. నియోజక వర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వు… నీకు సన్మానం చేస్తా అని చెప్పినా.. నిధులు ఇవ్వలేరు.. కానీ, చెక్కులు అందిస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంటింటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న దద్దమ్మ మంత్రి ఆయన అని ఫైర్ అయ్యారు.. పెండింగ్ ప్రాజెక్టులు గురించి సీఎం దగ్గర మాట్లాడలేని దద్దమ్మ.. నిర్వాసితులకు పైసలు ఇవ్వలేదు.. ఇండ్లు లేవు, వాటిని చూడు ముందు అని సలహాఇచ్చారు.. సీసీ రోడ్లు కు కూడా మంత్రి కొబ్బరికాయలు కొడుతున్నాడు.. అది తెలంగాణ మంత్రుల పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి..