Siddipet Taravva : సిద్దిపేట జిల్లాలో తారవ్వ అనే మహిళా రైతు పంట నష్టపోయిందంటూ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న ఘటనపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ సంఘటన మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తారవ్వ పంటను పూర్తిగా కొనుగోలు చేశారు. అంతేకాకుండా తారవ్వ అకౌంట్‌లో పంట మొత్తాన్ని కూడా డిపాజిట్ చేశారు. కేవలం…
Ration Card Verification : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల…
ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవొద్దు.. 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించ వద్దు అని స్పష్టం చేశారు..
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం…
KTR About Civil supplies : సివిల్ సప్లయ్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ. 11 వందల కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శాసన సభలో సివిల్ సప్లయ్ శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు.…
వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌరసరఫరాలశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Ration Dealership: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. రాష్ట్రంలోని ఆయా శాఖల్లో పేరుకుపోయిన సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కష్టాలు పేదలను సతాయిస్తున్నాయి. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తుండటంతో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్వర్ డౌన్ సమస్యలతో ఇప్పటి వరకు 40 శాతం మందికి కూడా పంపిణీ జరగలేదు. మరోవైపు రేషన్ బియ్యం ఇచ్చే గడువు 15తో ముగియడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. తమకు రేషన్ బియ్యం అందుతాయా లేదా అని వారు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తరచూ సర్వర్…