Ration Card Verification : జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న రేషన్ కార్డుల వెరిఫికేషన్..
- GHMC పరిధిలో కొనసాగుతున్న రేషన్ కార్డుల వెరిఫికేషన్
- ఇంటికి వెళ్లి ఆదాయం, ఆస్తులు వివరాలు వెరిఫై చేస్తున్న అధికారులు
- GHMC, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల సమన్వయంతో కొనసాగుతున్న ఫీల్డ్ వెరిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Card Verification : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ కొనసాగుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఆదాయం, ఆస్తులు వివరాలు వెరిఫై చేస్తున్నారు అధికారులు. GHMC, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల సమన్వయంతో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. రెండు లక్షల లోపు ఆదాయం ఉండి, బిలో పావర్టీ లైన్‌కు దిగువన ఉన్న వారు రేషన్ కార్డు అర్హులు అంటున్నారు అధికారులు. సొంత ఇండ్లు, ఆస్తులు ఉండి కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి అప్లికేషన్ డిస్ క్వాలిఫై చేస్తున్నామని అధికారులు అంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కోసం 83 వేల మంది అప్లై చేసుకున్నట్లు, ఈ నెల 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 24వ తేదీ నాటికి అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని, 25వ తేదీకి ఆయా జిల్లా కలెక్టర్లకు నివేదికను అందజేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న డేటాతో సరిచూసి, చివరగా ఈ నెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read
- Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
- Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
Fake Notes: కలవరపెడుతున్న రూ. 200 ఫేక్ నోట్లు.. మీ దగ్గర ఉన్నాయా? ఇలా గుర్తించండి!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో, జీహెచ్ఎంసీ పరిధిలో 22 లక్షల కుటుంబాల వివరాలను సేకరించింది. ఈ సర్వే అనంతరం కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. ఇందులో 83,285 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు.
ఇంటింటి సర్వేలో కూడా అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం తమ వివరాలను నమోదు చేసుకున్నారు. గతంలో కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడం, కార్డుల్లో మార్పులు చేసుకునే అవకాశాలు లేకపోవడంతో వేలాది మంది ప్రజలు కొత్త కార్డుల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రాథమికంగా అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తున్నారు. నివేదిక తయారు చేసి, ఈ నెల 26వ తేదీ నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నారు.
ఈ కొత్త ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని అనేక మంది అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడంలో సహాయపడుతుంది.
Bharat Mobility Expo : ఏళ్ల నిరీక్షణకు తెర.. హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేసిందోచ్..
తాజావార్తలు
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!