అనసూయ భరద్వాజ్. ఈ పేరు చెబితే చాలు కుర్రకారు జబర్దస్త్ విందు చేసుకుంటారు. షో ప్రారంభమై ఎన్నేళ్ళయినా ఖతర్నాక్ డ్యాన్స్ లతో ఆమె బుల్లితెర ప్రేక్షకుల్ని కనువిందు చేస్తుంటుంది. స్కిట్ స్కిట్ల మధ్యలో అనసూయ చేసే డ్యాన్స్ లు కుర్రకారుని మతి పోగొడుతుంటాయి.
బుల్లితెర కాదు వెండితెర పై కూడా అనసూయ అలరిస్తూనే వుంది. వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
లంగా వోణితో ఆమె అందమయిన ఫోటోలతో సునామీ సెన్సేషన్ కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుంటూ సామాజిక సమస్యలపైన స్పందిస్తూ వుంటుంది.