కళాకారులు కళానైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ… అదే కళాకారుడు ఓ హీరోకు వీరాభిమాని అయితే.. ఆ హీరో మరణిస్తే.. అప్పుడు తన గుండెలోతులోంచి వచ్చిన ఆలోచనను పెయింటింగ్ వేశాడో అభిమాని. ఆ పెయింటింగ్ చూసిన వారు కళ్లు చేమర్చక మానరనడంలో సందేహం లేదు.
ఇంతకు ఎవరిదీ పెయింటింగ్ అనుకుంటున్నారా.. ఇటీవల గుండె పోటు మృతి చెందిన పునీత్ తన తండ్రి రాజ్ కుమార్‌ను స్వర్గంలో కలుసుకున్నట్లు ఆ పెయింటింగ్ చెబుతోంది. బెంగుళూరుకు చెందిన కరణ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకున్నారు.ఈ పెయింటింగ్ చూసిన కన్నడిగులు భాగోద్వేగానికి లోనవుతున్నారు.