ఎంత పెద్ద మనిషైనా పాములు కనిపించగానే పై ప్రాణాలు పైనే పోతాయి. పాముని చూడగానే అక్కడినించి పరుగు లంకించుకుంటారు. పాములు పగబడతాయా..వెంటాడి కాటేస్తాయా? తప్పించుకున్న వదలవా? పాపాతికేళ్ల క్రితం పాము.. పాము పగతో సినిమాలు రావటం.. పాము పగ మీద బోలెడన్ని విషయాలు తరచూ మాట్లాడుకోవటం కనిపించేది. పాములు పగబడతాయని.. వెంటాడి.. వెంటాడి మరీ కాటేస్తాయని నమ్ముతోంది ఓ కుటుంబం. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని ఒక ఫ్యామిలీని వణికిపోతోంది. మరే కుటుంబం దొరకనట్లుగా.. ఒకే కుటుంబంలోని…
నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కే మాస్టర్ ప్లాన్ వేశారు అక్కడి అవినీతి అధికారులు. చెప్పింది చేస్తే నాకేంటి..? అని సూటిగా సుత్తిలేకుండా అడిగేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి తమలోని మాటకారితనాన్ని బయటకు తీస్తున్నారు మాయగాళ్లు. ‘మాకేంటి..!?’ అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారా? చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్, చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్‌ప్లాన్ కాసులు కురిపిస్తోంది. ప్లాన్‌పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు…
చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.…
ఈరోజుల్లో పెళ్లి పేరుతో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా ముగ్గుర్ని పెళ్ళాడాడు ఆ ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లాలో ముగ్గుర్ని పెళ్ళాడిన నిత్య పెళ్ళికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యలు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడు. ఈ నిత్య పెళ్ళికోడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోట కు చెందిన మంజునాథ్ అంగళ్ళ కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా…
అయితే అతివృష్టి… లేదంటే అనావృష్టి… ఇదీ టమాటా రైతుల పరిస్థితి. ఒక్కోసారి ఊహించనంత రేటు పలుకుతుంది. లేదంటే పాతాళానికి పడిపోతుంది. ప్రస్తుతం ఇదే జరగడంతో రైతు మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. టమాటా పేరు చెబితే గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్. కరోనా తర్వాత ఈమధ్యే కాస్త రైతు కోలుకున్నాడు. లావాదేవీలు కూడా ఆశాజనకంగా సాగాయి. కానీ కొద్దికాలంలోనే రేటు మళ్లీ కిందికి పడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈసారి పంట దిగుబడి ఊహించని స్థాయిలో…
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్రమ మైనింగ్ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి జిల్లాకు ఏం చేశాడని ప్రశ్నించారు. కుప్పంను అభివృద్ది చేయాలని కలలు కన్నాడని చెబుతున్నారని, 14 ఏళ్లు సీఎం గా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు దేవుఉ అయ్యారని, చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టమని అన్నారు.…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందచందాల ఆరబోత గురించి అస్సలు విశ్లేషించాల్సిన పని అంతకన్నా లేదు. తల్లి శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి రాజసాన్ని ఒంట పట్టించుకోని జాన్వీ అంచలంచలుగా ఎదుగుతోంది. ఇక జాన్వీ నిత్యం హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న మాట వాస్తవమే .. కానీ ఆమె ఎక్కడికి వెళ్లినా అలా మాత్రం ఉండదు.. రోమ్ లో రోమన్ లానే ఉండాలి అనే…
ఏపీలో టికెట్ రేట్ల విషయంపై వివాదం కొనసాగుతోంది. డిస్ట్రిబ్యూటర్ల ఆవేదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని పట్టుబట్టింది. దీంతో ఇప్పటికే పలువురు థియేటర్ యాజమాన్యాలు నష్టాల్లో సినిమాలను ప్రదర్శించలేక స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసేసుకున్నారు. మరోవైపు థియేటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ తనిఖీల్లో చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూత పడ్డట్లు సమాచారం. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరులలో నిన్న మధ్యాహ్నం నుంచే షో లు రద్దు…
చిత్తూరు జిల్లాలో మొత్తం 37 సినిమా థియేటర్ల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోట 3, బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4, పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్ల పల్లిలలో ఒక్కే థియేటర్ కు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మధ్యాహ్నం నుంచే 30కి పైగా థియేటర్లు మూతపడ్డయి. అయితే ఈ విషయం పై మీడియాతో మదనపల్లె సబ్…
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో మూడో రోజు కొనసాగుతున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలు ఇంటింటికి చేరుతున్నాయన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. గతంతో పోలిస్తే సమస్యలపై వచ్చే దరఖాస్తులు 90శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడు వేయలేదని మంత్రి తెలిపారు. నీళ్లు,…