చిత్తూరు జిల్లాలో రహదారులు రక్తమోడాయి. చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డివైడర్ ఢీకొనడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేగంగా వెళుతూ డివైడర్ ఢీకొట్టారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వుంది. వారిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కాణిపాకం నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారు విజయనగరం,శ్రీకాకుళం జిల్ల్లాలకు…
పుంగనూరు(మం)బొడినాయుడు పల్లె గ్రామంలో బ్లాక్ ప్యాడి వరి (నల్లబియ్యం) కంకులను దొంగతనం చేసిన సంఘటన కలకలం సృష్టిస్తుంది. మాములుగా అయితే దొంగలు నగలు, డబ్బు, మరేదైనా ఇతర వస్తువులను దొంగతనం చేస్తుంటారు. కానీ విచిత్రంగా నల్లబియ్యం పంటపై దొంగలు కన్నేయడం ఏంటని రైతు వాపోతున్నాడు. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అతి ఖరీదైన అరుదైన పంట ఈ నల్ల బియ్యం, ఈ కంకులను అర్ధరాత్రి కంకులను కోసుకుని వెళ్లారు గుర్తుతెలియని దుండగులు. కొత్త పంట పై రైతులకు…
చిత్తూరు జిల్లాలో బ్లాక్ ప్యాడి వరి పై కన్నేసారు దుండగులు. పుంగనూరు(మం) బొడినాయుడు పల్లె గ్రామంలో బ్లాక్ ప్యాడి వరి (నల్లబియ్యం) కంకులు దొంగతనం చేసారు. అతి ఖరీదైన అరుదైన పంట ఈ నల్ల బియ్యం పంట కంకులను అర్ధరాత్రి కంకులు కోసుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. బ్లాక్ పైడి బియ్యం మార్కెట్ విలువ కేజీ సుమారు 320రూ ఉంది. అయితే ఈ కొత్త పంట పై రైతులకు ఆసక్తి కోసం ఒకటిన్నర ఎకరాల్లో ఈ పంట వేసాడు…
వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే…
ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్‌లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్‌లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో…
చిత్తూరు జిల్లాలో రాయల చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రాయలచెరువు వ్యవహారంపై అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు చెరువు ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇపుడు చర్చనీయాంశమవుతోంది. ఆరు రోజుల కిందట చెరువు నిండినప్పుడే స్పందించి వుంటే వేలాదిమంది ఇళ్ళు వదలి వెళ్ళే పరిస్థితి వుండేది కాదంటున్నారు. రాయలచెరువు…
భారీవర్షాలు, వరదలతో తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్‌గా మారింది. చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరదనీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం వుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటేశ్వరపురం,…
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంపై భారీవర్షాలు తీరని భారం మోపాయి. భారీ వర్షాలు.. వరదలతో నాలుగు జిల్లాల్లో తీరని నష్టం సంభవించింది. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 24 మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కడపలో 13, అనంతలో 7, చిత్తూరులో 4 మంది జల విలయానికి బలయ్యారు. 17 మంది గల్లంతైనట్టు ప్రకటించింది ప్రభుత్వం. కడపలో 11, చిత్తూరులో…
కడప, తిరుపతి వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు సీఎం. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు ముఖ్యమంత్రి. హెలికాప్టర్ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన…