ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం వాకింగ్ చేస్తుంటాం. రోజూ ఉదయం పూట సమీపంలోని పార్క్‌కి వెళ్ళి అరగంటో.. గంటో వాకింగ్, ఎక్సర్ సైజ్ లు చేసి వస్తాం. కానీ వివిధ జంతువులు వాకింగ్ చేయడం చూశారా. చిత్తూరు జిల్లాలో పొద్దు పొద్దున్నే వాకింగ్ కు వచ్చిన ఏనుగు.. ఇప్పుడు వైరల్ అవుతోంది. పలమనేరు మండలం పెంగరగుంట గ్రామ పొలాల్లోకి వచ్చిన ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది. మనుషులు వాకింగ్ చేసిన మాదిరి పొలాలు రోడ్లపై అటు ఇటు…
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఇల్లు వుంది. అలాగే ఇప్పుడు కుప్పంలోనూ మరో ఇల్లు నిర్మించేందుకు అంతా సిద్ధం అయింది. కుప్పంలో ఇంటి నిర్మాణం కోసం ఇంతకుముందే భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. ఇవాళ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 1.99 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ మనోహర్ పేర్లమీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు.…
ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది. ఈనెల 23 తేదీన బైక్ పై వెళుతున్న తండ్రిని తిరుపతి సాగర్ షోరూం సమీపంలో కారుతో ఢీకొట్టాడు…
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం, ములకలేడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రును చికిత్సనిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. ఇవాళ (శనివారం) వేకువజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైనున్న మిద్దె కప్పు కూలి.. నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్థులు ఘటనాస్థలానికి…
ఏపీలో టెన్త్ పరీక్షలు జరుగుతోన్న సమయంలో.. ప్రశ్నాపత్రాల లీక్ వార్తలు కలకలం రేపాయి.. వరుసగా ప్రతీ పరీక్షపై ఏదో ఒక లీక్ వార్త ఆందోళన కలిగించింది.. అయితే, టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్‌పై ఏపీ సర్కార్ కఠిన చర్యలు ప్రారంభించింది.. నారాయణ సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసింది.. ప్రశ్నపత్రాలను వాట్సాప్‌లో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది షేర్ చేసినట్టుగా గుర్తించామని చెబుతున్నారు పోలీసులు.. దీనిపై చిత్తూరు పోలీసులు నిశిత దర్యాప్తు చేపట్టారు..…
తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక నారాయణ, చైతన్య విద్యాసంస్థల ప్రమేయం ఉందంటూ ఇటీవల ఏపీ సీఎం జగన్ బహిరంగంగానే వ్యాఖ్యానించిన నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌కు వచ్చి నారాయణను చిత్తూరు పోలీసులు తీసుకెళ్లారు. మాజీ మంత్రి నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి ఉన్నారు. మరోవైపు టెంత్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదు, కుట్ర పన్ని…
కుప్పంలో కలిసి సాగిన వైసీపీ నేతలు ట్రెండ్ మార్చేశారా? చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ ఆపరేషన్.. లోకల్ బాడీ ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఒకప్పుడు కుప్పం అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే కుప్పం అనే చర్చను మూడేళ్లలో మార్చేశారు వైసీపీ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మొదటి రెండు రౌండ్లలో మెజారిటీని తగ్గించి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు వైసీపీ కార్యకర్తలు. తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది అధికారపార్టీ. కుప్పం మున్సిపాలిటీలో…
ఇప్పటికే చాలా జండాలు మారాయి..చాలా కండువాలు కప్పారు.. తీసేశారు..కొంత కాలంగా ఇవన్నీ కాదని సైలెంట్ గా ఉన్నారు.. అయితే ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ గాలి కింద సేదదీరుదామనుకుంటున్నారట..హస్తం, సైకిల్, కమలం.. ఇవన్నీ దాటుకుని వచ్చిన ఆయన వైసీపీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట.. మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా?అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారా? కీలక నేత దారెటు? సి కే జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయనాయకుల్లో ఒకరైన సికె బాబు, నాలుగు సార్లు…
ఆర్ కె. రోజా..నగరి ఎమ్మెల్యేగా వున్న రోజాకు మంత్రిపదవి గ్యారంటీ అంటున్నారు. జగన్ కేబినెట్‌లో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించిన విధంగా పాత మంత్రులకు 10 మందికి అవకాశం దక్కగా..కొత్తగా 15 మందిని ఎంపిక చేసారు. అందులోనూ చిత్తూరు జిల్లా నుంచి ఫైర్ బ్రాండ్ కి బెర్త్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. జాబితాలో ఆమె పేరు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి మూడో మంత్రిగా రోజాకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో…
ఏపీలోని చిత్తూరు జిల్లాలో కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గం కుప్పం. అక్కడ రెవిన్యే డివిజన్ ఏర్పాటు అనంతరం ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రెవిన్యూ డివిజన్ ఏర్పాటుచేశామన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా…రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారు. https://ntvtelugu.com/cm-jagan-launch-new-districts-in-ap/ కుప్పం స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ కావాలని కోరటంతో కుప్పంను రెవెన్యూ డివిజన్ గా…