అప్పుడేమో హాట్.. ఇప్పుడేమో చీప్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయితే అతివృష్టి… లేదంటే అనావృష్టి… ఇదీ టమాటా రైతుల పరిస్థితి. ఒక్కోసారి ఊహించనంత రేటు పలుకుతుంది. లేదంటే పాతాళానికి పడిపోతుంది. ప్రస్తుతం ఇదే జరగడంతో రైతు మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.
టమాటా పేరు చెబితే గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్. కరోనా తర్వాత ఈమధ్యే కాస్త రైతు కోలుకున్నాడు. లావాదేవీలు కూడా ఆశాజనకంగా సాగాయి. కానీ కొద్దికాలంలోనే రేటు మళ్లీ కిందికి పడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈసారి పంట దిగుబడి ఊహించని స్థాయిలో వచ్చింది. వి.కోట మండలం మూడు రాష్ట్రాల కూడలిలో ఉంది.
Also Read
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
- Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ఇటు బెంగళూరు… అటు చెన్నై మరోవైపు హైదరాబాద్ ఉండడంతో పెద్ద ఎత్తున వ్యాపారులు ఇక్కడకు వచ్చి విక్రయాలు సాగిస్తారు. ప్రస్తుతం రోజూ దాదాపు 200 టన్నులకు పైగా సరుకు వస్తున్నా… ధర మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల కిలో 150 వరకు టమాటా పలికింది. అయితే ఇప్పుడు ఆరేటు కాస్తా ఐదు రూపాయలకంటే దిగువకు పడిపోయింది.
తెచ్చిన పంటను అమ్మినా… కనీసం పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు రైతులు. మరోవైపు గిట్టుబాటు ధర కల్పన కోసం ఈ-ఫామ్ మార్కెట్ పేరిట నాణ్యమైన పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తామని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలో ప్రస్తుతం టమోటా ధరలు గణనీయంగా పడిపోవడంతో పశ్చిమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
తాజావార్తలు
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!