చదువు సాగిస్తున్న వారిద్దరి మధ్య ప్రేమ చిరుగురించింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమలో పడ్డారు. ఆనందంగా గడపాలనుకున్నారు. ప్రేమ జీవితంలో అనోన్యంగా వుండాలని సంతోషంగా గడపాలనుకున్నారు. ఇద్దరు పెళ్ళికూడా చేసుకున్నారు. మూడేళ్ల తరువాత ఏమైందో ఏమో.. అతను మొఖం చాటేసాడు. ప్రేమ జీవితాంతం వుండదు కొద్దిరోజులే వుంటుంది అనే ఆరంజ్ సినిమా స్పూర్తిగా తీసుకున్నాడో ఏమో ఆప్రియురాల్ని వదిలేసి తనతో సంబంధం లేదంటూ మధ్య లోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆప్రియురాలు పోలీసులుకు ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని…
ChandraBabu Comments at Chittoor :టీడీపీ అధినేత వ్యాఖ్యలతో ఆ ఇద్దరు మంత్రులు డిఫెన్స్‌లో పడ్డారా? ఎలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా ఉంటున్నారా.. లేక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా?
నారా చంద్రబాబు నాయుడు.. నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే. నియోజకవర్గాలు.. పార్టీలు వేరైనా చిత్తూరు జిల్లా వాసులే. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్లల్లో తాతల కాలం నాటి ఇళ్లు ఉన్నాయి. ఇద్దరూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న పరిస్థితి లేదు. కానీ.. వివిద కారణాలతో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలోని…
ఏపీ డీజీపీకి రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇంట్లో పని చేస్తోన్న దళిత మహిళను వేధిస్తోన్న ఘటనలో డీజీపీకి NHRC నోటీసులు ఇచ్చింది. దళిత మహిళపై దొంగతనం బనాయించి అక్రమంగా కేసు పెట్టారంటూ NHRCకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నేరం ఒప్పుకోవాలంటూ దళిత మహిళ ఉమా మహేశ్వరిని కస్టోడియల్ టార్చర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు వర్ల…
చింతల రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. గత రెండు ఎన్నికల్లో వరసగా వైసీపీ నుంచి గెలిచారు. అంతకుముందు వాయల్పాడు ఎమ్మెల్యేగానూ పనిచేశారు చింతల. ఈ సీనియరిటీ రాజకీయంగా కలిసొస్తుందని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటున్నారట ఎమ్మెల్యేలు. పైగా పీలేరులో నల్లారి కుటుంబంపై గెలవడంతో వైసీపీలో గుర్తింపునకు కొదవే ఉండదని అనుకున్నారట. అయితే జరుగుతున్న పరిస్థితులు.. ఆశలు నెరవేరకపోవడం ఎమ్మెల్యేను కుంగతీస్తున్నట్టు సమాచారం. ఆ ఆవేదనలోనూ కూరుకుపోతున్నారట. 2019లోనే కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. మొన్నటి కేబినెట్…
కరోనా వల్ల చితికిపోయిన నేతన్నలు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తిరిగి పనుల్లో కుదురుకుంటున్నారు. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా… వీరికి విద్యుత్ ఛార్జీలు పెంపు గుదిబండగా మారాయి. పరిస్థితి ఇలానే ఉంటే రైతుల్లానే మేము కూడా ఆత్మహత్య చేసుకోవాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు నేత కార్మికులు. పరిశ్రమల కేటగిరీలోకి మార్చి అదనపు బిల్లులు వస్తూలు చేస్తుండటంతో.. నేత కార్మికుల విద్యుత్ ఛార్జీలు రెండు రెట్లు పెరిగాయి. ఈడీ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో నష్టపోతున్నామని…