Master Plan Corruption: అవినీతికి మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కే మాస్టర్ ప్లాన్ వేశారు అక్కడి అవినీతి అధికారులు. చెప్పింది చేస్తే నాకేంటి..? అని సూటిగా సుత్తిలేకుండా అడిగేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి తమలోని మాటకారితనాన్ని బయటకు తీస్తున్నారు మాయగాళ్లు.
‘మాకేంటి..!?’ అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారా?
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్, చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్‌ప్లాన్ కాసులు కురిపిస్తోంది. ప్లాన్‌పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు అక్కడి మాయగాళ్లు. మీరు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తాం.. అయితే మాకేంటి..? అని సిగ్గులేకుండా అడిగేస్తున్నట్టు చెబుతున్నారు బాధితులు.
ప్రజల అభ్యంతరాలే ఆసరా..!
రాబోయే రెండు దశాబ్దాల్లో చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ 2041 రూపొందించారు. ఆ ప్లాన్ ముసాయిదాను గత ఏడాది అక్టోబర్ 11న ప్రచురించారు. గృహ అవసరాలు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటు, బఫర్ జోన్, మిక్స్డ్ జోన్ ఎక్కడ ఉండాలో ప్లాన్‌లో పొందుపర్చారు. నగరంలోని 50 డివిజన్లలో జోన్ల వారీగా ఉన్న ప్రాంతాలను ప్రస్తావించి.. ప్రజల అభ్యంతరాలను కోరారు అధికారులు.
రోడ్డు రాకుండా ఉండాలంటే పైకం ఇవ్వాల్సిందే..!
ముసాయిదాపై కార్పొరేషన్‌కు 117, చుడాకు 145 అభ్యంతరాలు వచ్చాయి. నివాసిత ప్రాంతంలో రోడ్డు ప్రతిపాదించారని కొందరు.. పంట పొలాల్లో రింగు రోడ్డు చూపించారని మరికొందరు రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలిపారు. ఈ అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన కొందరు అధికారులు వసూళ్ల పర్వం చేపట్టారని ఆరోపణ. మీ స్థలంలో రోడ్డు రాకుండా ఉండాలంటే.. ఎంత సమర్పించుకోవాలో మొహమాటం లేకుండా అడిగేస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా భారీ మొత్తంలోనే వెనకేసుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం.
ఎమ్మెల్యే హెచ్చరికలు భేఖాతర్
అవినీతి అధికారుల బేరసారాలను కొందరు బాధితులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులైన అధికారులను ఆయన హెచ్చరించినట్టు సమాచారం. కానీ.. ఎమ్మెల్యే వార్నింగ్స్ చెల్లుబాటు కావడం లేదని తెలుస్తోంది. అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి నుంచి ఓ రేంజ్‌లో పిండేస్తున్నట్టు టాక్. ఇప్పుడీ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లినట్టు చెబుతున్నారు. మరి.. వారైనా పరిస్థితిని చక్కదిద్దుతారో లేక.. వసూలు చేసిన దాంట్లో వాటా అడుగుతారో చూడాలి.
తాజావార్తలు
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!