ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది.
ఈనెల 23 తేదీన బైక్ పై వెళుతున్న తండ్రిని తిరుపతి సాగర్ షోరూం సమీపంలో కారుతో ఢీకొట్టాడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు మాజీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.తండ్రి చంద్ర శేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ చనిపోయారు. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు,మొదటి భార్య చనిపోగా ఆమె కొడుకుల్లో ఒకరు చనిపోగా రెండవ కుమారుడే లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. కొడుకు కోరిన మేరకు సగం ఆస్తి రాసిచ్చాడు తండ్రి చంద్రశేఖర్.
ఎక్కడ బామర్దికి మొత్తం ఆస్తి ఇస్తాడో అని కొడుకు లక్ష్మీప్రసాద్ రెడ్డి తన కారుతో ఢీ కొట్టి యాక్సిడెంట్ గా చిత్రీకరించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కుమారుడ్ని అరెస్టు చేశారు పీలేరు పోలీసులు. తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్ళిపోయాడా తండ్రి. ఆస్తి కోసం ఏదైనా చేసే ఇలాంటి కొడుకులకు కఠిన శిక్ష విధించాలని స్థానికులు, కుటుంబసభ్యులు కోరుతున్నారు.
Tesla In India: భారత్‌కు ఎలాన్ మస్క్ మొండిచెయ్యి