టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఇల్లు వుంది. అలాగే ఇప్పుడు కుప్పంలోనూ మరో ఇల్లు నిర్మించేందుకు అంతా సిద్ధం అయింది. కుప్పంలో ఇంటి నిర్మాణం కోసం ఇంతకుముందే భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. ఇవాళ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 1.99 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు.
చంద్రబాబుతో పాటు ఆయన పీఏ మనోహర్ పేర్లమీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. త్వరలోనే ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు చంద్రబాబు. 32(a)ఫారంలో చంద్రబాబు సంతకాలు చేసి ఇవ్వడంతో చంద్రబాబు పేరుమీద 93 సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు సబ్ రిజిస్ట్రార్. ఇంటి నిర్మాణం కోసం 93 సెంట్లు భూమి చంద్రబాబు పేరుపై, మిగతా భూమిని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు.93 సెంట్లలో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు చంద్రబాబు. హైదరాబాద్ ఇంటి తరహాలోనే ఇక్కడ కూడా భారీగా ఇంటి నిర్మాణం, సకల సౌకర్యాలు కల్పించనున్నారు.
తమ అధినేత చంద్రబాబు ఇంటిని నిర్మించుకుంటే తమకు అందుబాటులో వుంటారని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంటి నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు.
Jammu Kahmir: కేంద్రం కీలక నిర్ణయం.. లోయలో కాశ్మీర్ పండిట్ టీచర్ల బదిలీ.