ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది అని తాను ముందే చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టామని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని.. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని చెప్పారు. ఫోన్ టాపింగ్ పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.
Rinku Singh: మౌనం వీడిన రింకూ.. ప్రపంచకప్‌లో చోటు దక్కపోవడంపై రోహిత్ అలా అన్నాడా..
తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదు, అలాంటి పనులు చేయనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్ లో ఉందో ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చాలని తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో విద్యుత్ సమస్య, కోతలు లేవని అన్నారు. కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవంతరాలు ఉన్నాయని చెప్పారు. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫర్ చేశారని.. తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించామని సీఎం చెప్పారు.
Karnataka: భార్యతో గొడవ.. తల నరికి, ముక్కలు ముక్కలు చేసిన భర్త..
మరోవైపు.. రాష్ట్రంలో తన పాలన అత్యంత పారదర్శకంగా సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వడంలేదని చెప్పారు. తెలంగాణ అంటేనే రాచరికనికి వ్యతిరేకమని.. త్యాగాలు, పొరటాలు గుర్తొస్తాయన్నారు. అవే గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించామన్నారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయనికే వదిలేశామని చెప్పారు. రాజముద్ర రూపకల్పనకు బాధ్యత ఇచ్చింది ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన తెలంగాణ నిజామాబాద్ బిడ్డ అని సీఎం పేర్కొన్నారు.