China Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై బ్లాక్ బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు.
Chinese Travellers Rushing To Hong Kong For mRNA Covid Vaccines: చైనాను కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా చైనా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడం, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా అక్కడ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. రాజధాని బీజింగ్, షాంఘై ఇతర నగరాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ లేకుండా రోగులతో నిండిపోయాయి.
Army Chief General Manoj Pande: లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి చైనా బలగాల్లో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు భారీ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాల సంఖ్య స్వల్పంగా పెరిగిందని.. వారి కదలికను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. చైనా బలగాల కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. చైనాతో ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చైనాను…
India Now World's 3rd Largest Auto Market After China And US: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమార్కెట్ గా ఇండియా ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండియా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ దేశాన్ని అధిగమించి మన దేశం ఈ స్థానంలోకి చేరింది. నిక్కీ ఆసియా ప్రకారం.. మొదటిసారిగా ఇండియా మూడో స్థానానికి చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది వాహనాల విక్రయం కనీసం…
జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని మనం సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు వీటి సరసన కరోనాను కూడా చేరుస్తూ చైనా క్వారంటైన్ను ఎత్తివేసింది. ఆదివారం నుంచి కరోనా కూడా సాధారణ వ్యాధే.
పొగమంచు కారణంగా తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లో ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
World Will Benefit If People Of India And China Work Together says Dalai Lama: చారిత్రాత్మకంగా బౌధ్ద దేశమైన చైనా, అహింసా-కరుణ ఆదర్మాలను కలిగిన భారత్ కలిసి పనిచేస్తే ఈ ప్రపంచానికే ప్రయోజనం అని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. రెండున్నర బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేస్తే ఈ గ్రహం మొత్తానికి మంచిదని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు…
Hospitals run out of beds as Covid patients increase in China: చైనాలో కోవిడ్ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. అక్కడి ప్రజలు లక్షల్లో కోవిడ్ బారిన పడుతున్నారు. మరణాలు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని బీజింగ్ లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ లోని అన్ని ఆస్పత్రుల్లో బెడ్లు అన్ని నిండిపోయాయి. రోగులు హాల్ లో స్ట్రెచర్లపై పడుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.…
అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో వివిధ రకాల వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి భారత్కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి.
China Corona: ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడుతాడు అన్న సామెత గుర్తుందిగా.. ఇప్పుడు చైనా పరిస్థితి అదే. తాను కనిపెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఆ దేశాన్ని వదలట్లేదు.