India has surpassed China to become the most populous country in the world, as per estimates: ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశం అంటే నిన్నమొన్నటి వరకు చైనా అని అంతా సమాధానం చెప్పేవారు. రెండో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఉండేది. ఇప్పుడు ఇక ఈ సమాధానం మారబోతోంది. జనాభాలో చైనాను ఇప్పటికే భారత్ దాటేసిందని ఓ అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మారిందని అంచానా వేస్తున్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ(డబ్ల్యూపీఆర్) అంచానా ప్రకారం భారతదేశం జనాభాలో చైనాను అధిగమించినట్లు తెలిపింది.
వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచానా ప్రకారం.. 2022 చివరి నాటికి భారత జనాభా 141.7 కోట్లు. ఇది జనవరి 17న చైనా ప్రకటించిన జనాభా 141.2 కోట్లతో పోలిస్తే 50 లక్షలు. ఎక్కువ 1960 తరువాత మొదటిసారిగి చైనాలో జనాభా తగ్గుతోందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది జనవరి నెలలో భారత్, చైనాను అధిగమించిందని అంచానా వేస్తున్నారు.
Read Also: Kishan Reddy: బీఆర్ఎస్ కలల పార్టీ.. ఢిల్లీకి పోతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారు
భారతదేశంలో 50 శాతం జనాబా 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. యువశక్తి భారతదేశానికి ప్రయోజనం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ మొదటిస్థానంలో ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం, జనవరి 18 నాటికి భారత జనాభా 142.3 కోట్లకు పెరిగిందని ఓ అంచానా. భారతదేశ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, జనాభా 2050 నాటికి ఇలా పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే రీసెర్చ్ ప్లాట్‌ఫారమ్ మాక్రోట్రెండ్స్ భారత జనాబా 142.8 కోట్లకు చేరిందని అంచానా వేసింది. 2021లో మహమ్మారి కారణంగా ప్రతీ పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కింపులను నిలిపివేశారు.
భారత్ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆసియాలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. బియ్యం, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. నూనెల దిగుమతిదారుగా మొదటిస్థానంలో ఉండగా.. చక్కెర అతిపెద్ద వినియోగదారుగా ఉంది. ముడిచమురు కొనుగోలులో భారత్ మూడవ అతిపెద్ద మార్కెట్. ఉక్కు, బంగారం యొక్క అతిపెద్ద రెండో వినియోగదారు, భారత్ మూడో అతిపెద్ద దేశీయ విమాన మార్కెట్ ను కలిగి ఉంది.