Covid 19 situation in China: చైనాలో కోవిడ్ ప్రళయం సృష్టిస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు చైనా ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారినపడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం చైనీస్ న్యూ ఇయర్ కోసం దేశవ్యాప్తంగా కోట్లలో ప్రజలు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చైనీస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. జనవరి 13 నుంచి 19 మధ్య చైనా ఆస్పత్రుల్లో ఏకంగా 13,000 మంది మరణించినట్లు వెల్లడించింది. అంతకుముందు జనవరి 12 వరకు 60,000 మంది మరణించినట్లు తెలిపింది.
Read Also: Twitter: యాడ్స్ ఫ్రీగా ట్విట్టర్.. కానీ కండిషన్స్ అఫ్లై.. ఎలాన్ మస్క్ మరో బిగ్ మూవ్..
ఇదిలా ఉంటే ఈ లెక్కలు కేవలం ఆస్పత్రుల్లో మరణించిన వారి సంఖ్యే. ఇక ఇళ్లలో చనిపోయిన వారి సంఖ్య తీసుకుంటే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కానీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేవలం ఆస్పత్రుల్లో చనిపోయిన వారి సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటోంది. వారం వ్యవధిలో మరణించిన వారిలో 681 మంది ఆస్పత్రిలో చేరి శ్వాసకోశ వైఫల్యంతో మరణించాని.. ఇన్ఫెక్షన్, ఇతర వ్యాధుల వల్ల 11,977 మంది మరనించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే లూనార్ న్యూ ఇయర్ తరువాత చైనాలో రోజూవారీ మరణాల సంఖ్య రోజుకు 36,000కు చేరుకుంటాయని ఎయిర్ ఫినిటీ అనే స్వతంత్ర సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు చైనా శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. ఇప్పటికే చైనా ప్రజల్లో 80 శాతం మందికి కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు, వచ్చే రెండు మూడు నెలల్లో చైనాలో సెకండ్ వేవ్ కోవిడ్ ఇన్ఫెక్షన్లు సంభవించే అవకాశం లేదని చెబుతున్నారు. చైనా ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడంతో అక్కడ కరోనా మహమ్మారి వేగంగా వ్యాపించింది. దీంతో పాటు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఓమిక్రాన్ వేరియంట్ బీఎఫ్.7 వల్ల ప్రజలు కరోనా బారిన పడటం ఎక్కువ అయింది.