11-yr-old Chinese boy cycled 130 kms for almost 24 hrs: సాధారణం అమ్మ కొడితేనో, నాన్న తిడితేనో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లడం చూస్తుంటాం. కొందరు కావాలని కొద్ది సేపటి వరకు తల్లిదండ్రులకు కనిపించకుండా దాక్కుంటారు. ఇలాంటి ఘటనలను మనం నిత్య జీవితంలో చూస్తునే ఉంటాం. ఇదిలా ఉంటే చైనాకు చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు మాత్రం తన తల్లిపై కంప్లైంట్ చేయడాని ఏకంగా 130 కిలోమీటర్ల దూరంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం…
India Economy: ఆర్థికమాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, గాలి బుడగలా మారాయి. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే శ్రీలంక దివాళా తీసింది.
H3N8 Bird Flu: మానవుల్లో అత్యంత అరుదుగా కనిపించే బర్డ్ ఫ్లూతో చైనాలో ఒకరు మరణించారు. ప్రపంచంలోనే ఇలా మరణించడం ఇదే మొదటిసారి. అయితే ప్రజల నుంచి ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దక్షిణ ప్రావిన్స్ ఆఫ్ గ్వాంగ్డాంగ్కు చెందిన 56 ఏళ్ల మహిళ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H3N8 సబ్టైప్ బారిన పడిన మూడవ వ్యక్తి అని డబ్ల్యూహెచ్ఓ మంగళవారం తెలిపింది.
Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై చైనా తన గుప్పిట్లోకి తీసుకోవాలని అనుకుంటోంది. అయితే ఎప్పటికప్పుడు భారత్ అరుణాచల్ విషయంలో చైనా వైఖరిపై దృఢంగా వ్యవహరిస్తోంది. ఇటీవల డ్రాగన్ కంట్రీ అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లను మార్చింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేర్లు మార్చినంత మాత్రాన అరుణాల్ మీదైపోదంటూ ఘాటుగానే బదులిచ్చింది.
China VS Taiwan: తైవాన్ ద్వీపకల్పాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్లాన్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లతో తైవాన్ ద్వీపాన్ని చుట్టుముడుతోంది చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ). తైవాన్ అధ్యక్షురాలు అమెరికా పర్యటనకు వెళ్లడం, అక్కడ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ తో భేటీ కావడం చైనాకు రుచించలేదు. ఈ చర్య అనంతరం తైవాన్ ను కబలించేందుకు చైనా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం భారీ…
IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.
Great Lover: ప్రియురాలిని ఒప్పించేందుకు ప్రేమికుడు చేసే సాహసాలను మనం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసి ఉంటాం. సందర్భానుసారంగా వర్షం వస్తుంది. చలి పెరుగుతుంది.. కానీ ప్రేమికుడు కొంచెం కూడా చెదరడు.
Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేర్లు మార్చడం ద్వారా వాస్తవ పరిస్థితిని మార్చలేరని, చైనా తీరును ఖండించింది భారత్. చాలా ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని దక్షిణ టిబెట్ పేరుతో పలుస్తోంది చైనా. ఇంతకుముందు కూడా రెండు సార్లు ఇలాగే పేర్లను మార్చింది.