Sri Lanka Monkeys To China : కోతులను కూడా అమ్మకానికి పెట్టిన శ్రీలంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఏకంగా తన దేశపు జంతువుల్ని కూడా అమ్మేసుకోవటానికి సిద్ధపడుతోంది. శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల్ని లంక ప్రభుత్వం చైనాకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. శ్రీలంక- చైనాకు ఎగుమతి చేసే ఆకోతులు అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్నాయని IUCN చెబుతోంది. కానీ శ్రీలంకలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని చైనా తన అవసరాలు తీర్చుకుంటున్నట్లుగా ఉందీ.. చైనా-శ్రీలంక నుంచి లక్ష కోతుల్ని దిగుమతి చేసుకోవటానికి ప్రతిపాదన పెట్టింది. ఇంత భారీ సంఖ్యలో కోతుల్ని దిగుమతి చేసుకోవాలని చైనా అనుకోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోతులు ప్రయోగాల కోసమే దిగుమతి చేసుకుంటోంది అనే అనుమానాలు వస్తున్నాయి. చైనా చేసిన ప్రతిపాదనపై శ్రీలంక ఆలోచిస్తోంది. శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన జాతికి చెందిన ‘టోక్ మకాక్’ కోతులను పంపించే విషయంపై ఆదేశపు ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Read Also : Kotamreddy Sridhar Reddy: సీఎం జగన్‌కు థాంక్స్ చెప్పిన కోటంరెడ్డి.. ఎందుకంటే..?
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
దీనికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయాలని శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర సంబంధిత అధికారులకు సూచించారని బుధవారం (ఏప్రిల్,2023) ఓ న్యూస్ రావటం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో ఈ కోతుల సంఖ్య అధికంగా ఉందని దీంతో చైనా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చని మహింద భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చైనాలోని జూలలో ప్రదర్శనకు లక్ష కోతులను కోరిందని శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర వెల్లడించారు. కోతుల ఎగుమతి విషయంలో న్యాయపరమైన చిక్కులేమైనా ఉంటాయా? అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి క్యాబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు.
Read Also : Gangster Atiq Ahmed: తండ్రి కాన్వాయ్‌పై దాడికి అసద్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు ..
చైనాలోని జూలలో ప్రదర్శనకు చైనా లక్ష కోతులను కోరిందని శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర వెల్లడించారు. కోతుల ఎగుమతి విషయంలో న్యాయపరమైన చిక్కులేమైనా ఉంటాయా? అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి క్యాబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు.అయితే.. ప్రస్తుతం శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఇవి స్థానికంగా ఉన్న పంటలను దెబ్బతీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి సంతతిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదని..ఇటువంటి టైంలో చైనా నుంచి కోతుల ఎగుమతి కోసం అభ్యర్థన వచ్చినట్లు చెబుతున్నారు.
Read Also : Cyber Attack: 12 వేల భారత వెబ్‌సైట్లను టార్గెట్ చేసిన ఇండోనేషియా హ్యాకర్లు…
మరి ఈ కోతులను ఉచితంగా ఇస్తారా? లేక కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అలాగే చైనా తమ జూలలో ప్రదర్శన కోసం అడుగుతోందా? లేదా వాటిపై ప్రయోగాలు చేయటానికి దిగుమతి చేసుకోవాలనుకంటోందా? అనే విషయంపై చర్చ జరుగుతుంది. కాగా..శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్యలో భారీగా పెరిగి పంటల నష్టం కలుగుతోందని ప్రభుత్వం చెబుతుండగా.. శ్రీలంకలో మాత్రమే కనిపించే ‘టోక్ మకాక్’ జాతి కోతులు రెడ్ లిస్టులో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) వెల్లడించింది. కోతుల్ని చైనాకు తరలించేందుకు చర్చిందుకు మంత్రి మహింద నేషనల్ జూలాజికల్ గార్డెన్స్ శాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. శ్రీలంకలో ప్రస్తుతం కోతుల సంఖ్య దాదాపు 3 మిలియన్లకు చేరుకుందని, స్థానిక పంటలకు ఇవి పెనుముప్పుగా ఉన్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దీంతో అసలే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో కోతుల్ని చైనాకు తరలించటానికి మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!