భార్యభర్తలిద్దరూ లైవ్ లో జిమ్నాస్టిక్ చేస్తుండగా అనూహ్యా ఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కలిసి ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారు. అలాంటిది అనుకోకుండా ఘోర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు కమ్ముకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. చైనీస్ అక్రోబాట్ జిమ్నాస్టిక్ ప్రదర్శనలో భాగంగా ఒక స్టంట్ చేస్తున్నారు. లైవ్ లో ఎప్పుడూ రోటిన్ గా తన భాగస్వామితో చేసే స్టంట్ చేస్తోంది. ఈ మేరకు ఆమె సెంట్రల్ అన్హుయ్ ప్రావిన్స్ లోని సుజౌ నగరంలో ప్లయింట్-ట్రాపెజ్ ప్రదర్శనలో భాగంగా లైవ్ లో విన్యాసం చేస్తుండగా.. అనుహ్యంగా 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది.
Also Read : Mysore Fire Accident: మైసూరులో భారీ అగ్నిప్రమాదం.. ఏకంగా రెండు కీలోమీటర్ల మేర..
దీంతో ఆమె భాగస్వామి కాళ్లతో అమెను పట్టుకోవడంలో విఫలమవ్వడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో హుటాహూటినా ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే సదరు మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని సమాచారం. ఆ భార్యభర్తలిద్దరూ ఇలాంటి ప్రదర్శనలు చాలా సార్లు ఇచ్చారని.. పైగా ఎప్పుడూ కూడా బెల్ట్ లు లేకుండానే చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగేకంటే ముందు ఇద్దరు గొడవపడ్డారిన.. ఆ మహిళ సేఫ్టి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పినా.. నిరాకరించిందని సమాచారం. అయితే ఆమె భర్త మాత్రం ఆ వ్యా్ఖ్యలను ఖండించారు. తాము ఎప్పుడూ అనోన్యంగా ఉండేవాళ్లమని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
Also Read : Viral Video: ఆర్గానిక్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఆవు.. వీడియో వైరల్