పొరుగు దేశాల విషయంలో ఆధిపత్య ప్రదర్శన కోసం డ్రాగన్ కంట్రీ చేసే ప్రయత్నాలు తీవ్ర తరం చేస్తుంది. ఈ క్రమంలో.. తైవాన్‌పై చైనా దేశ మిలిటరీ అధికారులు వేధింపులకు పాల్పడుతూ వస్తున్నారు. అయితే, తాజాగా.. ఏకంగా వందకి పైగా యుద్ధవిమానాలను తైవాన్ వైపు పంపించి చైనా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యింది.
Indian Navy Fleet: భారత్-చైనాల మధ్య భూసరిహద్దులోనే కాకుండా సముద్రంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొని ఉండడంతో ఇరు దేశాలు పరస్పరం ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇరు దేశాల మధ్య పోటీ నెలకొంది.
China: జపాన్ లోని అమెరికా రాయబారి రహమ్ ఇమ్మాన్యుయేల్ ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్టు చేశారు. ‘మొదటిది రక్షణ మంత్రి లీ షాంగ్ఫు 3 వారాల నుంచి కనిపించడం లేదు. రెండోది అతడిని గృహనిర్భందంలో ఉంచినందుకే వియత్నా పర్యటనలో కనిపించలేదు, సింగపూర్ నేవీ చీఫ్ తో సమావేశం కాలేదు..?’ అంటూ వ్యాఖ్యానించారు.
G20 Summit: భారతదేశం జీ20 సమావేశాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు డ్రాగన్ కంట్రీ చైనా, దాయాది దేశం తట్టుకోలేకపోతున్నాయి. భారత పరపతి పెరగడాన్ని చైనా మీడియా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ మీడియా అయిన గ్లోబల్ టైమ్స్ ఈ సదస్సును తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఇక పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం దాచకుండా తన పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరించింది. అంతర్జాతీయ మీడియా భారత ప్రయత్నాలను మెచ్చుకుంటే, చైనా…
China Sending Military aircrafts, warships near to Taiwan : తైవాన్ విషయంలో డ్రాగన్ కంట్రీ మరోసారి రెచ్చిపోతుంది. తైవాన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుతుంది. దీని కారణంగా ఆ రెండు ప్రాంతాల్లో యుద్దవాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తైవాన్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో తైవాన్ భూభాగంలోకి చైనాకు చెందిన యుద్ద విమానాలు, యుద్ద నౌకలు ప్రవేశించాయని పేర్కొంది. 22 సైనిక యుద్ధ విమానాలు, 20 యుద్ధ నౌకలు…
G20 Summit: ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారతదేశం జీ20 సదస్పును నిర్వహించింది. బైడెన్, రిషి సునాక్, మక్రాన్ వంటి దేశాధినేతలు న్యూఢిల్లీకి వచ్చారు. ఈ సమావేశాల్లో భారత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రపంచ దేశాధినేతలకు మరిచిపోలేని విధంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇదిలా ఉంటే చైనా అధికారులు మాత్రం ఓవర్ యాక్షన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా డేలిగేట్స్ బ్యాగులను చెక్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
China Minister Li Shangfu Missing: డ్రాగన్ కంట్రీలో హై ప్రొఫెల్ వ్యక్తులు మిస్సవుతున్నారు. గతంలో విదేశాంగ మంత్రి చిన్‌గాంగ్ మిస్సవగా తాజాగా ఏకంగా రక్షణ శాఖ మంత్రి కనిపించకుండా పోయారు. రెండు వారాల క్రితం బీజింగ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడిన తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు. దీంతో ఆయన మిస్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని జపాన్ లోని యునైటెడ్ స్టేట్స్ రాయబారి కూడా ట్వీట్…
China: చైనాకు వరసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చైనా తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అత్యంత సులభంగా అమ్ముకునేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును తీసుకువచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టాలే ఉన్నట్లు ప్రపంచదేశాలు గమనించాయి. ఇదే కాకుండా భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్‌కి భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్ దేశాలు సమ్మతించడం చైనాకు పెద్ద దెబ్బగా
G20 Summit: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. భారత్ ఇస్తున్న ఆతిథ్యానికి ప్రపంచ దేశాధినేతలు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే భారత్ జీ20 నిర్వహిస్తుండటంపై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా మరోసారి భారతదేశంపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా థింక్ ట్యాంక్ భారతదేశం తన సొంత ఎజెండాను ప్రచారం చేయడానికి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగించడానికి జీ20 అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటోందని ఆరోపించింది.
ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు కనబడతాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ బిల్డింగ్ లోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.