Asian Games: చైనా మరోసారి తన బుద్ధిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్‌ని నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా భారత క్రీడాకారులను అడ్డుకోవడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా చర్యకు భారత్ శుక్రవారం నిరసన తెలిపింది. ఈ నేపథ్యం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Also: Vivek Ramaswamy: చైనాను అడ్డుకోవాలంటే భారత్‌తో బంధం బలపరుచుకోవాల్సిందే.. రిపబ్లికన్ నేత వ్యాఖ్యలు..
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అక్రిడేషన్, వీసా నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన క్రీడాకరుల పట్ల చైనా వివక్ష చూపింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమే అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. భారత అథ్టెట్లపై ఉద్దేశపూర్వకంగా చైనా ఇలా చేయడం ఆసియా క్రీడల స్పూర్తిని ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు కలిగి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ నెలలో జీ20 సమావేశాలకు ముందు చైనా ప్రామాణిక మ్యాపుల పేరుతో అరుణాచల్ ప్రదేశ్, లడాక్ ప్రాంతాలను తన మ్యాపుల్లో చూపించింది. ఇది ఇరు దేశాల మధ్య తీవ్ర వివాదం స్పష్టించించింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ ని దక్షిణ టిబెట్ లో అంతర్భాగమని వాదిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు భారత్, అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని చైనాకు ధీటుగా బదులిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ విషయంపై చైనా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికా ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. చట్టబద్ధంగా ఆసియా గేమ్స్ లో పాల్గొనేందుకు చైనా అన్ని దేశాల అథ్లెట్లను స్వాగతిస్తోందని ఆయన అన్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే చైనా ప్రభుత్వం దాన్ని గుర్తించలేదని, జాంగ్నాన్ (నైరుతి చైనా యొక్క జిజాంగ్ అటానమస్ రీజియన్ యొక్క దక్షిణ భాగం) చైనా భూభాగంలో భాగం” అని నింగ్ చెప్పారు.