Canada-India row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడం,
China: ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.
ఆన్లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ చైనా నుంచి నిధులు తీసుకుని దానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి వెస్ట్రన్ దేశాలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ‘‘రష్యా కొత్త ప్రపంచాన్ని నిర్మించే పనిలో ఉంది’’ అని గురువారం అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వెస్ట్రన్ దేశాలే కారణమని నిందించారు. ప్రపంచ ఆధిపత్యం కోసం పశ్చిమ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. పాశ్యాత్య దేశాలకు ఎప్పుడూ ఓ శతృవు కావాలని ఎద్దేవా చేశారు. వాల్దాయ్ పొలిటికల్ ఫోరమ్ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ రాజకీయ అస్థిరత, భద్రత కారణంగా కొత్త బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులను చైనా తిరస్కరించింది.
NewsClick: చైనా అనుకూల ప్రచారం చేస్తూ, చైనా నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో న్యూస్‌క్లిక్ మీడియా పోర్టల్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ప్రబీర్ పురకాయస్థను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తోపాటు
తూర్పు లడఖ్‌లోని సరిహద్దు రేఖ వద్ద చైనాతో సైనిక ప్రతిష్టంభన ముగిసి, చైనా దళాలు వెనక్కి తగ్గే వరకు భారత వైమానిక దళం వెనక్కి తగ్గదని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. భారత వైమానిక దళం కార్యాచరణ సన్నాహాలు పూర్తిగా వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా డైనమిక్‌గా కూడా ఉన్నాయని అన్నారు.
హిందూ మహాసముద్రంలో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్న నెపంతో చైనా గూఢచారి నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విస్తారమైన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నాయి. ఈ నౌకల నుంచి సేకరించిన డేటా మలక్కా జలసంధి, తూర్పు హిందూ మహాసముద్రం నిస్సార జలాల ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న చైనీస్ జలాంతర్గాములకు అమూల్యమైనది.