చైనా నుంచి నిధులు తీసుకుని వారికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై ఆన్లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన 30 ప్రాంగణాలపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దాడి చేసింది. దీంతో పాటు న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన జర్నలిస్టుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. చైనాతో జరిగిన స్వర్ణ పతక పోరులో భారత్ ఓటమి పాలైంది.
China Real Estate Crisis: ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం ఆగే సూచనలు కనిపించడం లేదు.
Australia: రెండో ప్రపంచ యుద్దం తరువాత చైనా అతిపెద్ద సాంప్రదాయిక సైనిక సమీకరణను ఏర్పాటు చేస్తోందని ఆస్ట్రేలియన్ రాయబారి మంగళవారం అన్నారు. అయితే ఈ సైనికీకరణ వ్యూహాత్మక ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయడకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్టకాలంలో చైనాతో ఆస్ట్రేలియా సంబంధాన్ని స్థిరీకరించకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
భవిష్యత్తులో కొత్త కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ హెచ్చరించారు. షి జెంగ్లీ జంతువుల నుంచి వచ్చే వైరస్‌లపై పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. ఆమెను ప్రపంచంలో బ్యాట్ వుమన్ అని కూడా పిలుస్తారు.
చైనా నుంచి వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కొత్త వీసా రహిత ప్రవేశ కార్యక్రమం కింద సోమవారం బ్యాంకాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది మంది చైనీస్ పర్యాటకులకు థాయ్‌లాండ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
‘China an existential threat to US says Indian-American Nikki Haley: కరోనా (కోవిడ్ 19) అనే మహమ్మారిని ప్రపంచ దేశాలపైకి వదిలి.. అందరినీ గడగడలాడించిన చైనా.. ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికీ పెద్ద ముప్పుగా మారిందని, ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం న్యూహ్యాంప్ షైర్ లో ఏర్పాటు చేసిన…
రేపటి నుంచి చైనాలోని జాంఘులో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు అనుమతి చైనా అనుమతి నిరాకరించింది. ఈ చర్యపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని చైనా ఎంబసీ, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
Asian Games: చైనా మరోసారి తన బుద్ధిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్‌ని నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా భారత క్రీడాకారులను అడ్డుకోవడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా చర్యకు భారత్ శుక్రవారం నిరసన తెలిపింది. ఈ నేపథ్యం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Vivek Ramaswamy: చైనా గుత్తాధిపత్యం, సైనిక దూకుడు, విస్తరణవాదాన్ని అడ్డుకోవాలంటే భారతదేశం మాత్రమే సరైందని అమెరికాతో పాటు అన్ని యూరోపియన్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు భావిస్తున్నాయి. దీంతో భారతదేశంతో చైనా వ్యతిరేక దేశాలు సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ నేత, ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.