Australia: రెండో ప్రపంచ యుద్దం తరువాత చైనా అతిపెద్ద సాంప్రదాయిక సైనిక సమీకరణను ఏర్పాటు చేస్తోందని ఆస్ట్రేలియన్ రాయబారి మంగళవారం అన్నారు. అయితే ఈ సైనికీకరణ వ్యూహాత్మక ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయడకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్టకాలంలో చైనాతో ఆస్ట్రేలియా సంబంధాన్ని స్థిరీకరించకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
భారతదేశంలో ఆస్ట్రేలియన్ హైకమిషన్ గా ఉన్న ఫిలిప్ గ్రీన్ కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే చైనాతో మాకున్న ఉత్పాదక కార్యకలాపాలకు ఆస్ట్రేలియా ప్రాధాన్యత ఇస్తోందని, క్లిష్టకాలంలో మా సంబంధాలను స్థిరీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యయాని అన్నారు.
Read Also: Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు హైదరాబాద్ లో వైన్స్ బంద్
ఇండియాస్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ‘‘కోల్‌కతా డైలాగ్ – ఆస్ట్రేలియా అండ్ ఇండియా: వర్కింగ్ టుగెదర్ టు బిల్డ్ ఐలాండ్ స్టేట్ రెసిలెన్స్’’ కార్యక్రమంలో మిస్టర్ గ్రీన్ కోల్‌కతాలో ప్రసంగించారు. రెండు రోజుల 13వ ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్స్ కాన్ఫరెన్స్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన సందర్భంగా కోల్‌కతా డైలాగ్ జరుగుతోంది. ఇండో-పసిఫిక్ ద్వీప దేశాల్లో క్లైమెట్ రిసిలెన్స్ నిర్మించడంతో పాటు ఈ ప్రాంతంలో బలవంతపు ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకోవడం, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా, ఆస్ట్రేలియాలకు ఇంట్రెస్ట్ ఉంది. ఇదే ఈ రెండు దేశాల మధ్య వివాదాలకు కారణమవుతోంది. పసిఫిక్ ప్రాంతంతో చైనాకు అడ్డుకట్ట వేయడానికి భారత్-అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా దేశాలు ‘క్వాడ్’ పేరుతో కూటమిని కట్టాయి. దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా మరియు వియత్నాం దేశాలో చైనా వివాదం సృష్టిస్తోంది. సముద్రంలో కృత్రిమ ద్వీపాలను ఏర్పాటు చేసి ఆ దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది.